Main Menu

బాబుకి గ‌ట్టి షాక్

Spread the love

ఏపీ సీఎం చంద్ర‌బాబుకి గ‌ట్టి షాక్ త‌గిలింది. ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాల్లో పెను మార్పులు ఖాయంగా మారుతోంది. చీరాల ఎమ్మెల్యేని కాపాడుకునేందుకు చివ‌రి నిమిషం వ‌ర‌కూ చేసిన ప్ర‌య‌త్నాలు ఆయ‌న‌కు చేదు అనుభ‌వం మిగిలింది. ఆమంచి కృష్ణ‌మోహ‌న్ చేజారిపోయారు. ఆయ‌న టీడీపీ అధినేత‌ను క‌లిసి నేరుగా క‌లిసి వ‌చ్చిన త‌ర్వాత రాజీనామా స‌మ‌ర్పించి , వైసీపీలో చేరిపోవ‌డం బాబుకి పెద్ద ఎదురుదెబ్బ‌గా మారుతోంది.

చంద్ర‌బాబు మీద కూడా ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు. పిచ్చోడంటారా..లేక అల్జీమ‌ర్స్ అంటారా అంటూ అన్ని విష‌యాల్లోనూ మాట మార్చారంటూ చంద్ర‌బాబు మీద మండిప‌డ్డారు. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌లు చూడ‌వ‌ద్ద‌ని నేరుగా చూస్తే రాజ‌ధానిలో ఏముంద‌ని ప్ర‌శ్నించారు. ఆమంచి దూకుడు ఇప్పుడు అనూహ్యంగా మారింది. దుర్మార్గంగా, ఇష్ట‌మొచ్చిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఆయ‌న వ‌ర్గ‌మే కుల‌వాదంతో సాగుతున్నార‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేసి క‌ల‌క‌లం రేపారు. రాష్ట్రాన్ని ర‌క్షించ‌డానికే త‌న ప్ర‌య‌త్నం అని చెప్ప‌డం విశేషంగా మారింది.

అదే స‌మ‌యంలో చీరాల‌లో మారిన సీన్ తో ఒక్క‌సారిగా వాతావ‌ర‌ణం వేడెక్కింది. చీరాల‌లో ఆమంచి ఫ్లెక్సీలు తొల‌గించేందుకు టీడీపీ శ్రేణులు కొంద‌రు చేసిన ప్ర‌య‌త్నం ఉద్రిక్త‌త‌కు దారితీసింది. అదే స‌మ‌యంలో చీరాల బాధ్య‌త‌లు క‌ర‌ణం బ‌ల‌రాం కి బాబు అప్ప‌గించారు. టీడీపీ మీటింగ్ పెట్టి చీరాల‌లో తెలుగుదేశం వ్య‌వ‌హారాలు చూడాలంటూ ఆదేశించారు. దాంతో సీన్ పూర్తిగా మారిపోవ‌డంతో వ్య‌వ‌హారం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. వైసీపీ శ్రేణుల‌కు మాత్రం ఇది ఊపునిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు.






Related News

చంద్ర‌బాబు చేతులెత్తేసిన‌ట్టేనా?

Spread the love14Sharesఏపీ సీఎం చంద్ర‌బాబు ఇప్పుడు ఉక్కిరిబిక్కిర‌వుతున్నారు. ఒక‌వైపు వ‌రుస‌గా సంక్షేమ ప‌థ‌కాల‌తో జ‌నాల‌ను ఆక‌ట్టుకుంటున్న‌ప్ప‌టికీ మ‌రోవైపు సొంతRead More

బాబుకి గ‌ట్టి షాక్

Spread the loveఏపీ సీఎం చంద్ర‌బాబుకి గ‌ట్టి షాక్ త‌గిలింది. ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాల్లో పెను మార్పులు ఖాయంగా మారుతోంది.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *