మ‌హిళా అధికారిపై వేధింపుల కేసులో అచ్చెన్న‌?

achennaidu
Spread the love

అచ్చెన్నాయుడు మ‌రో మ‌రోవివాదంలో ఇరుక్కుంటున్నారు. ఏపీలో కాస్త నోరున్న మంత్రిగా పేరుగ‌డించిన అచ్చెన్నాయుడు మ‌హిళా అధికారిని వేధించి ఇర‌కాటంలో ప‌డిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. ఇప్ప‌టికే ప‌లుమార్లు మ‌హిళల‌ను వేధించినట్టు అచ్చెన్న పేరు వినిపించింది. కొద్దిరోజుల క్రితం ఓ మ‌హిళ ఆత్మ‌హ‌త్యా చేయ‌డం, అచ్చెన్న మీద ఆరోప‌ణ‌లు చేయ‌డం విశేషం. మ‌హిళా అధికారుల‌ను వేధించిన విష‌యం గ‌తంలోనే ఆయ‌న సొంత జిల్లాలో క‌ల‌క‌లం రేపింది. చివ‌ర‌కు ఎక్సైజ్ శాఖలో ప‌నిచేసిన ఓ ఉన్న‌తాధికారిణి ప‌ట్ల చివ‌ర‌కు క‌ర్నూలు వెళ్లినా వేధింపులు ఆప‌లేద‌ని ప్ర‌చారం సాగింది. క‌ర్నూలు ఇన్ఛార్జ్ మంత్రిగా అక్క‌డికి వెళ్లిన త‌ర్వాత మ‌హిళా అధికారిని వేధించిన‌ట్టు క‌థ‌నాలు కూడా వ‌చ్చాయి.

ఇక తాజాగా సెక్ర‌టేరియేట్ లో ప‌నిచేస్తున్న ఓ ఉన్న‌తాధికారిణి పట్ల మంత్రి తీరు వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. ఆమె ఏకంగా కేంద్ర హోం శాఖ అధికారుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్టు తేల‌డం వివాదాస్ప‌దం అవుతోంది. ఏపీలో ఉన్న‌తాధికారుల‌కు ఈ వేధింపు విష‌యంపై ఫిర్యాదు చేసినా ఆమెకు ర‌క్ష‌ణ లేద‌ని చెబుతున్నారు. సీఎం ఆశీస్సులు దండుగా ఉండ‌డంతో కేసును ప‌ట్టించుకోలేదంటున్నారు. దాంతో చివ‌ర‌కు స‌ద‌రు ఉన్న‌తాధికారిణి నేరుగా కేంద్రానికి ఫిర్యాదు చేయ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఏపీ నుంచి డిప్యూటేష‌న్ పై వెళ్లిపోవాల‌ని నిర్ణ‌యించుకున్న త‌ర్వాతే ఆమె ఈ ఫిర్యాదు చేసిన‌ట్టు చెబుతున్నారు.

దాంతో సచివాల‌య వ‌ర్గాల్లో ఇదో సంచ‌ల‌నంగా మారింది. చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఏపీ ఇప్ప‌టికే మ‌హిళ‌ల‌పై వేధింపుల్లో దేశంలోనే ముందంజ‌లో ఉంది. చివ‌ర‌కు స‌చివాల‌యంలో ఉన్న‌త‌స్థాయి మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేద‌నే ప్ర‌చారం సాగ‌డం, దానికి కార‌ణం ఓ మంత్రి కావ‌డం దుమారం రేపే అవ‌కాశం క‌నిపిస్తోంది.


Related News

jdlakshminarayana11521726505

జేడీ ఆ కండువా క‌ప్పుకుంటారా?

Spread the love8Sharesజేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌. జ‌గ‌న్ కేసుల పుణ్యాన మంచి క్రేజ్ సంపాదించారు. ఓ పోలీస్ విచార‌ణాధికారిగా ఉన్న వ్య‌క్తికిRead More

Vijay-Sai-Reddy-Controversi

విజ‌య‌సాయిరెడ్డి మీద గురిపెట్టిన టీడీపీ

Spread the love9Sharesటీడీపీ రూటు మార్చింది. వైఎస్ జ‌గ‌న్ తో పాటుగా వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విష‌యంలో కూడా సీరియ‌స్Read More

 • ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై ప‌రువు న‌ష్టం కేసు!
 • వైసీపీ ఎంపీల రాజీనామాలు
 • పవన్ కళ్యాణ్ పై మళ్లీ కత్తిదూశాడు…!
 • వైసీపీ ఇంకెప్పుడు నేర్చుకుంటుందో..!
 • బాబుకి మోడీ స‌మాధానం ఎలా ఉంటుంది?
 • క‌మ‌లంలో కాక రాజుకుంది..
 • వైసీపీ ఓ అడుగు వేసిన‌ట్టే..
 • చంద్ర‌బాబుకి, కేసీఆర్ కి తేడా అదే!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *