Main Menu

వీర్రాజు నోట జైలు మాట‌….

Spread the love

ప్ర‌త్యేక హోదా పేరుతో త‌మ‌ను బ‌ద్నాం చేస్తున్న చంద్ర‌బాబుకి బ్రేకులు వేయాల‌ని బీజేపీ భావిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. దానికి త‌గ్గ‌ట్టుగా అధిష్టానం అండ‌తో ఏపీ నేత‌లు చురుగ్గా పావులు క‌దుపుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఓ వైపు రాయ‌ల‌సీమ డిక్ల‌రేష‌న్ పేరుతో విభ‌జ‌న వాదం, చంద్ర‌బాబు కేసులో పేరుతో క‌ట్ట‌డి మంత్రం ముందుకు తెస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఒకే రోజు అటు అమ‌రావ‌తిలో సోము వీర్రాజు నోట జైలు విష‌యం ప్ర‌స్తావ‌న‌కు రావ‌డం, ఇటు క‌ర్నూలులో రాయ‌ల‌సీమ పేరుతో చంద్ర‌బాబు అవినీతి గురించి ప్ర‌స్తావించడం విశేషంగా మారింది. మొత్తంగా మారుతున్న బీజేపీ స్వ‌రం గురించి స్ప‌ష్ట‌మ‌వుతోంది.

వాస్త‌వానికి ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో బీజేపీకి రాయ‌ల‌సీమ‌లో పెద్ద‌గా ఒరిగేదేమీ ఉండ‌దు. గ‌తంలో ఒక ఓటు – రెండు రాష్ట్రాల నినాదం తెచ్చి పెట్టిన బీజేపీకి ప్ర‌యోజ‌నం ద‌క్కింది కూడా లేదు. ఏపీ విభ‌జ‌న‌కు అన్ని ర‌కాలుగా మ‌ద్ధ‌తిచ్చిన‌ప్ప‌టికీ జ‌నం ఆపార్టీని అంత‌గా విశ్వ‌సించ‌లేదు. ఇప్పుడు రాయ‌ల‌సీమ పేరుతో అందుకున్న నినాదం కూడా అంత‌గా ఫ‌లించే అవ‌కాశం లేదు. దానికి కార‌ణం కేంద్రంలో, రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలో ఉండ‌డ‌మే. అయితే కేసుల విష‌యం మాత్రం చంద్ర‌బాబు గొంతులో ప‌చ్చి వెల‌క్కాయ‌ప‌డ్డ‌ట్టు చేస్తుంద‌న‌డంలో సందేహం లేదు. ముఖ్యంగా ఓటుకు నోటు ప్ర‌స్తావ‌న వ‌చ్చిన ప్ర‌తీసారి బాబుకి కొంత క‌ల‌వ‌రం త‌ప్ప‌దు. తాజాగా మ‌త్త‌య్య అఫ్రూవ‌ర్ గా మారిపోతాన‌ని చెప్ప‌డం వెనుక కార‌ణాల‌పై ప‌లు సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఏపీ రాజ‌కీయాలు వేగంగా మారుతున్న త‌రుణంలో బ్రీఫ్డ్ మీ అంటూ మ‌రోసారి ముందుకు తెచ్చిన కేసు వెనుక క‌థ ఎవ‌రో న‌డిపిస్తున్నార‌నే అనుమానం బ‌ల‌ప‌డుతోంది. అది అన్ని వ‌ర్గాల్లోనూ చ‌ర్చ‌కు తావిస్తోంది. స‌రిగ్గా సోము వీర్రాజు ఎవ‌రు జైలుకి పోవాలో చెప్పండి అంటూ ప్ర‌శ్నించిన నాడే మ‌త్త‌య్య కేసు ముందుకు రావ‌డం కొంత విశేషంగా మారుతోంది. ఈ ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు ఎలాంటి ఎత్తులు వేస్తారో చూడాల్సి ఉంది. అయితే బీజేపీ మాత్రం దేశంలో అనేక‌మంది నేత‌ల‌ను కేసుల ద్వారా త‌మ‌వైపు తిప్పుకుంటున్న అనుభ‌వం స్ప‌ష్టంగా ఉన్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు కి అదే పెద్ద త‌ల‌నొప్పిగా మారుతుంద‌న‌డంలో సందేహం లేదు. చివ‌ర‌కు ఎలాంటి మ‌లుపులు తీసుకుంటుందో చూడాలి.


Related News

వైసీపీ హోరు గాలి, టైమ్స్ నౌ తాజా స‌ర్వే

Spread the loveజాతీయ మీడియా సంస్థ‌ల స‌ర్వేల‌లో వైసీపీ హోరు గాలి వీస్తోంది. ఆపార్టీకి సంపూర్ణ ఆధిక్యం ఖాయంగా క‌నిపిస్తోంది.Read More

వైసీపీ రెండో జాబితా ఎంపీ అభ్య‌ర్థులు

Spread the loveశ్రీకాకుళం- దువ్వాడ శ్రీనివాస్ విజ‌య‌న‌గ‌రం- బెల్లాని చంద్ర‌శేఖ‌ర్ విశాఖ‌ప‌ట్ట‌ణం-ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌ అన‌కాప‌ల్లి- డాక్ట‌ర్ స‌త్య‌వ‌తి కాకినాడ వంగాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *