పవన్ ఎఫెక్ట్ తో .. స్పందించిన చంద్రబాబు

cm
Spread the love

ఉద్దానంలో కిడ్నీ భాదితులను కలిసి పరామర్శించి వారిని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చేసిన విజ్ఞప్తితో… సీఎం చంద్రబాబు స్పందించారు. కుప్పం తరహాలో ఉద్దానంలో కూడా మంచినీటి ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని అధికారులను బాబు ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శికి ఈ బాధ్యతలను అప్పగించారు. ఈ నెల 26వ తేది నాటికి బాధిత గ్రామాలకు తాగునీటిని అందించాలని డెడ్‌లైన్ పెట్టారు. కిడ్నీ సమస్య ఉన్న అన్ని గ్రామాలకు మినరల్ వాటర్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. ఎన్టీఆర్ సుజల పథకం కింద రూ. 2కు 20 లీటర్లు నీరు ఇస్తామన్నారు. కిడ్నీ సమస్య ఎందుకు వస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారన్నారు. ఆక్సిన్‌ లెవల్స్‌ నీటిలో రావడం… సిలికాన్‌ నేలలో ఉండటం వల్ల వస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారని సీఎం తెలిపారు. దీనిపై రెండు నిపుణుల కమిటీలతో పరీక్షలు చేయించామని, సమస్య పరిష్కారానికి ప్రపంచ మేధావులను పిలుస్తామని ఆయన తెలిపారు. పూర్తిగా నివారించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, సీరియస్‌ పేషెంట్లకు పెన్షన్లు ఇస్తామని చంద్రబాబు అన్నారు. కేజీహెచ్ ఆసుపత్రికి పోవాలంటే ఉచితంగా పాసులిచ్చి కేజీహెచ్‌కు పంపుతామని సీఎం చెప్పారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అండగా నిలుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.


Related News

bjp

బీజేపీ ఎమ్మెల్యే భార్య జనసేనలోకి జంప్

Spread the love3Sharesబీజేపీకి ఏపీలో అన్నీ సమస్యలే. ఇప్పటికే కన్నా ఎంపిక మీద సోము వీర్రాజు చిటపటలు చల్లారయని భావిస్తుంటేRead More

Paradise-Papers-Will-Narendra-Modi-Come-to-YS-Jagan-Rescue

బీజేపీతో వైసీపీ పొత్తు ఉంటుందా?

Spread the love5Sharesఇదో చర్చ సాగుతోంది. బీజేపీ, వైసీపీ మధ్య బంధం కొంత కాలంగా బలపడుతోంది. రాజకీయ అవసరాల రీత్యాRead More

 • జగన్ కి పెద్ద లోటు
 • నారా లోకేష్ కి అవార్డ్
 • ఏపీలో ఎన్నికలు జరుగుతాయా?
 • బీజేపీకి రాజీనామాలు
 • వైసీపీలో జగన్ ని మించిపోతున్న ఎంపీ
 • వైసీపీకి ‘కాపు’ కాచేనా…?
 • జ‌గ‌న్ కి జ‌న‌సేన‌ని ద‌గ్గ‌ర చేస్తున్న బాబు
 • బాబుని మోడీ లైట్ తీసుకుంటున్నారా…?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *