చంద్రబాబు కొత్త కోరిక

విభిన్నమైన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ఆనంద సూచీలో అగ్ర స్థానంలో నిలిపామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వేదికగా ఆదివారం నిర్వహించిన విమాన విన్యాసాలు తిలకించిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు. విమాన విన్యాసాల్లో అంతర్జాతీయంగా పేరున్న గ్లోబల్ స్టార్ సంస్థ ఇక్కడ ప్రదర్శన ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఇటీవలే సోషల్ మీడియా సమ్మిట్, ఎఫ్ 1 బోట్ రేసింగ్ విజయవాడలో నిర్వహించామని వాటికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పారు. బోట్ రేసింగ్ పోటీలకు ఇంతటి అనువైన ప్రాంతం ప్రపంచంలో ఎక్కడా లేదని సీఎం అభిప్రాయపడ్డారు. అమరావతిలో ప్రజలకు నిత్యం వినోదం, ఆహ్లాదం పంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమం చూస్తుంటే తనకూ పైలట్ కావాలన్న కోరిక కలుగుతోందని సరదాగా వ్యాఖ్యానించారు. ప్రకాశం బ్యారేజీని ఇన్నాళ్లు సక్రమంగా ఉపయోగించలేదని.. ఇక్కడ పర్యాటకం బాగా అభివృద్ధి చెందేందుకు అవకాశాలున్నాయని తెలిపారు. కూచిపూడి నృత్యానికి ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో ప్రభుత్వ కార్యక్రమంలో తప్పనిసరిగా కూచిపూడి ఉండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
విజయవాడ ప్రకాశం బ్యారేజీ వేదికగా మూడో రోజు విమాన విన్యాసాలు అబ్బుర పరిచాయి. కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. యుకెకు చెందిన గ్లోబల్ స్టార్ సంస్థ ఆధ్వర్యంలో గగనతల విన్యాసాలు 15 నిమిషాల పాటు సాగాయి. పర్యాటక శాఖ, ఫిక్కీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా గ్లోబల్ స్టార్ సంస్థ ప్రతినిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు సన్మానించారు. కార్యక్రమం నిర్వహించిన ఫిక్కీ, పర్యాటక శాఖ అధికారులకు సీఎం అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం జరిగిన నాటు పడవ పోటీల్లో విజేతలకు సీఎం చేతుల మీదగా బహుమతి ప్రదానం చేశారు.
Related News

చంద్రబాబు అభ్యర్థుల కసరత్తు లక్ష్యం నెరవేరేనా?
Spread the loveఏపీలో తెలుగుదేశం పార్టీ గతానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. చివరి నిమిషం వరకూ ఊరించి, నామినేషన్ల గుడువు ముగిసిపోయేRead More

టీడీపీని వీడబోతున్న మూడో ఎంపీ ఆయనే..!
Spread the loveగోదవరి జిల్లాల తెలుగుదేశం రాజకీయాల్లో తోట బ్రదర్స్ తలనొప్పిగా తయారయ్యారు. ఇప్పటికే తోట త్రిమూర్తులు తన పార్టీRead More