Main Menu

ఆస్ప‌త్రి పాల‌యిన స్టార్ హీరో

Spread the love

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. తీవ్ర అనారోగ్యంతో ఆస్ప‌త్రిలో చేరారు. హీరోగా, నడిగర్‌ సంఘం ప్రధాన కార్యదర్శిగా, తమిళ చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాల్ కి విశేష‌మైన గుర్తింపు ఉంది. తెలుగువాడ‌యిన‌ప్ప‌టికీ త‌మిళ‌నాటే గుర్తింపు సాధించారు. అయితే తాజాగా ఆయ‌న ఢిల్లీ ఆస్పత్రిలో చేరారు. తీవ్రమైన తలనొప్పి కారణంగా ఆయన ఆస్పత్రిలో చేరినట్టు సమాచారం.

గ‌తంలో విశాల్‌ ఇరుంబుతిరై అనే చిత్రంలో నటించే సమయంలో గాయపడ్డాడు. అపుడు ఆయనకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ఫిజియోథెరపీ చేయించుకోవాల్సిందిగా సలహా ఇచ్చారు. కానీ, ఆయన తాత్కాలికంగా వైద్యం చేయించుకొని సినిమా షూటింగ్‌లో పాల్గొంటూ వచ్చారు.

ఈ నేపథ్యంలో ఆయన నటిస్తున్న సండైకోళి 2 చిత్రం షూటింగ్‌ను ఇటీవలే పూర్తి చేశారు. దీంతో ఆయన ఇటీవల ఢిల్లీకి వెళ్ళి ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. దీనిపై విశాల్‌ అనుచరులు స్పందిస్తూ, తాజాగా నటిస్తున్న సండైకోళి 2 చిత్రం షూటింగ్‌ పూర్తి కావడంతో ఫిజియో థెరఫీ కోసం విశాల్‌ ఆస్పత్రిలో చేరినట్టు వెల్లడించారు.






Related News

స‌మంత 96

Spread the loveతమిళ చిత్రం ‘96’ హిట్టు టాక్ తెచ్చుకోవడంతో -టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఆలస్యం చేయకుండాRead More

మ‌హేష్ మార్చిలోనే..!

Spread the loveమహేశ్‌ బాబు త్వరలో చేయనున్న తాజా చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఆ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *