Main Menu

విశాల్ కి మ‌రో విజ‌యం

Spread the love

త‌మిళ‌గ‌డ్డ మీద అన్నిర‌కాలుగానూ దూసుకుపోతున్న తెలుగుబిడ్డ విశాల్ మ‌రో ఖ్యాతి గ‌డించాడు. హీరోగానే కాకుండా నిర్మాత‌గానూ తాను హీరోనేన‌ని చాటుకున్నాడు. నిర్మాత మండ‌లి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి త‌న స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు. కోలీవుడ్ లో మరోసారి చరిత్ర సృష్టించారు. ఏడాదిన్నర క్రితం నటుడిగా నడిగర్‌ సంఘం ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసిన విశాల్‌ ఇప్పుడు నిర్మాతగాను తన సత్తా నిరూపించుకున్నారు. 2017-19 సంవత్సరాలకు తమిళ సినీ నిర్మాతల మండలి నూతన కార్యవర్గం ఎన్నికల్లో అధ్యక్షుడిగా విశాల్‌ సంచలన విజయం సాధించారు. ఆయన జట్టు తరపున పోటీచేసిన ప్రకాష్‌రాజ్‌, గౌతమ్‌ వాసుదేవ మీనన్ (ఉపాధ్యక్షులు), ఎస్‌ఆర్‌ ప్రభు (కోశాధికారి) కూడా గెలుపును సొంతం చేసుకున్నారు.

సీనియర్‌ తమిళ నిర్మాత రాధాకృష్ణన్, తెలుగు నిర్మాత కోదండరామయ్య (కేఆర్‌), విశాల్‌ జట్లతో త్రికోణపోటీ నెలకొన్న ఈ ఎన్నికల్లో అంతిమ విజయం విశాల్‌ జట్టునే వరించింది. స్థానిక అన్నానగర్‌లోని కందస్వామి నాయుడు కళాశాలలో విశ్రాంత న్యాయమూర్తి ఎస్‌.రాజేశ్వరన్ పర్యవేక్షణలో ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్మాతల మండలి ఎన్నికలు జరిగాయి. మండలిలో మొత్తం 1,212 మంది సభ్యులుండగా, 1059 ఓట్లు నమోదయ్యాయి. 5 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభించి, రాత్రి 8.30 గంటలకు ఫలితాలు ప్రకటించారు.

అధ్యక్ష పదవికి పోటీచేసిన విశాల్‌ 478 రాధాకృష్ణన్ 355, కేఆర్‌ 224 ఓట్లు సాధించారు. తొలి రౌండ్‌ నుండే విశాల్‌ ముందంజలో నిలిచి విజయం సాధించారు. నిర్మాతల మండలి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం విశాల్‌ మాట్లాడుతూ… ‘మార్పు కావాలనుకుంటే దాన్ని ఎవరూ అడ్డుకోలేరు. నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. మా జట్టు అంకితభావంతో పనిచేస్తుంది. మాకు పదవులు ముఖ్యంగా కాదు. రాబోయే రెండేళ్లలో నిర్మాతల మండలి చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేయడమే లక్ష్యం. తమిళ సినిమాకు మళ్లీ స్వర్ణయుగం తీసుకొస్తా’ అని విజయోత్సాహంతో ప్రకటించారు.






Related News

ఎన్టీఆర్ లో రాశిఖ‌న్నా రోలేంటో తెలుసా..?

Spread the loveఎన్టీఆర్ బ‌యోపిక్ ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్ అవుతోంది. భారీ తార‌గ‌ణంతో వ‌స్తున్న సినిమా పెద్ద చ‌ర్చ‌కుRead More

పూరీ ద‌ర్శ‌క‌త్వంలో రెండో మ‌న్మ‌థుడు

Spread the loveటాలీవుడ్ లో బ‌యోపిక్ లు, సీక్వెల్స్ సీజ‌న్ జోరుగా ఉంది. దాంతో అంద‌రూ హీరోలు వాటినే అనుస‌రిస్తున్నారు.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *