Main Menu

ఆమెను దేవుడే పంపాడంటున్న విశాల్

Spread the love

టాలీవుడ్ నుంచి వెళ్లి కోలీవుడ్ లో కీర్తి గ‌డించిన తెలుగు బిడ్డ‌ విశాల్ చివ‌ర‌కు తెలుగు అమ్మాయినే మ‌నువాడ‌బోతున్నాడు. తొలుత హీరోయిన్‌ వరలక్ష్మీ శరత్‌కుమార్‌తో ప్రేమలో ఉన్నారనీ, ఆమెనే పెళ్లి చేసుకుంటారని వార్తలు వినిపించాయి. ఆ క‌థ‌నాల‌కు ఫుల్ స్టాప్ పెట్టేసి తాను మాత్రం అనీశా అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్లు వెల్లడించిన విశాల్ తీరు ఆస‌క్తిగా మారింది.

అంతేగాకుండా త‌న‌కు కాబోయే భార్య గురించి విశాల్ ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. ‘‘అయోగ్య’ సినిమా వల్ల అనీశా పరిచయమైంది. ఆ పరిచయం పెళ్లికి వరకూ తీసుకొస్తుందని అనుకోలేదు. ముందు నేనే తనకు ప్రపోజ్‌ చేశా. వీధి శునకాలపై ఓ సినిమా తీయబోతున్నా. ఆ స్ర్కిప్ట్‌ను అనీశాకు చదివి వినిపించి ఫీడ్‌బ్యాక్‌ అడిగితే చెప్పింది. తను నటి మాత్రమే కాదు జాతీయ స్థాయి బాస్కెట్‌ బాల్‌ క్రీడాకారిణి, సోషల్‌ వర్కర్‌ కూడా. పెళ్లి తర్వాత సినిమాలు మానేస్తుందని చెప్పను. తనకు ఏది నచ్చితే అది చేస్తుంది. తనలో ఎవరికీ తెలీని ఓ కళ ఉంది. ఓ పులికి శిక్షణ ఇచ్చి దానిని నిమిషాల్లో నిద్రపుచ్చగలదు. అలాంటి ఓ వీడియో చూసి ఆశ్చర్యపోయాను. అనీశాను దేవుడే నా కోసం పంపాడు’’ అని విశాల్‌ చెప్పారు.






Related News

‘సైరా’ అంటున్న‌ అల్లు అర్జున్

Spread the loveమెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం శరవేగంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.Read More

ఆమెను దేవుడే పంపాడంటున్న విశాల్

Spread the loveటాలీవుడ్ నుంచి వెళ్లి కోలీవుడ్ లో కీర్తి గ‌డించిన తెలుగు బిడ్డ‌ విశాల్ చివ‌ర‌కు తెలుగు అమ్మాయినేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *