Main Menu

ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ కి ముహూర్తం పెట్టిన రాజ‌మౌళి

Spread the love

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ముమూర్తం పెట్టేశాడు. ఇద్ద‌రు టాలీవుడ్ టాప్ స్టార్ల‌తో క‌లిపి మ‌ల్టీస్టార‌ర్ మువీకి రంగం సిద్ధం చేశారు. రాజవౌళి దర్శకత్వంలో తెరకేక్కే క్రేజీ మల్టీస్టారర్ డిసెంబర్ నుండే సెట్స్‌పైకి రానున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌తోపాటు ప్రీ ప్రొడక్షన్ పనులు వేగం పుంజుకున్నాయి. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్న సినిమా కోసం ప్రత్యేకంగా వర్క్‌షాప్ నిర్వహిస్తున్నాడు రాజవౌళి. ఈనెల చివరివారం నుండి ఈ వర్క్‌షాప్‌లో ఎన్టీఆర్, చరణ్‌లు పాల్గోననున్నారట. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ల కోసం అనే్వషణ జరుగుతుంది. చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేసి 2020 సంక్రాంతికి విడుదల చేస్తారట. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అటు నందమూరి హీరో, ఇటు మోగా హీరో కలిసి నటిస్తుండటం బిజినెస్ వర్గాల్లో సంచలనం రేపుతోంది.






Related News

ర‌వితేజకి ఇద్ద‌రు!

Spread the love కాజల్‌ అగర్వాల్‌ మరో తెలుగు సినిమా చేసేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. ఆమె రవితేజకు జోడీగా నటించనుంది.Read More

ప్ర‌భాస్ పిరియాడిక్ మువీ..!

Spread the love ‘సాహో’ చిత్రీకరణలో వుండగానే ప్రభాస్‌ ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ సినిమాలోనూ నటిస్తున్నాడు. ఇదివరకే యూరప్‌లో కొంతభాగంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *