నేను మ‌హేష్ అన్న కుటుంబ స‌భ్యుడిని…

DaMbXNpV4AEipwZ
Spread the love

భ‌ర‌త్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ఘ‌నంగా జ‌రిగింది. ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హైద‌రాబాద్ లో జ‌రిగిన భ‌ర‌త్ బ‌హిరంగ‌స‌భ విజ‌యవంతంగా సాగింది. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తన‌ను అంద‌రూ ముఖ్య అతిథిగా పేర్కొంటున్నార‌ని ..కానీ తాను మాత్రం కుటుంబ స‌భ్యుడిగానే ఇక్క‌డికి వ‌చ్చాన‌ని తెలిపారు. అంద‌రూ ప్రిన్స్, సూప‌ర్ స్టార్ అంటున్న‌ప్ప‌టికీ తాను మాత్రం మ‌హేష్ అన్న అంటాన‌ని వెల్ల‌డించారు. అంద‌రి క‌న్నా అందంగా ఉంటాడ‌ని, ఒక ర‌కంగా చెప్పాలంటే అత‌డో అరుదైన ర‌కం..అలానే ఉండ‌నిద్దాం అంటూ మ‌హేష్ నుద్దేశించి వ్యాఖ్యానించారు. మ‌హేష్ స్ఫూర్తితోనే తామంతా ప్ర‌యోగాలు చేస్తున్నామ‌న్నారు. మ‌హేష్ ఎప్పుడో విభిన్న ప్ర‌యోగాలు చేసిన ఘ‌నుడంటూ కొనియాడారు. కొర‌టాల శివ సినిమాల ద్వారా స‌మాజం మీద త‌న ప్రేమ‌ను, వ్య‌క్తిగా త‌న బాధ్య‌త‌ను చాటుతున్నార‌ని, దానిని కొన‌సాగించాల‌ని ఆశించారు.

అనంత‌రం మాట్లాడిన మ‌హేష్ బాబు కూడా ఈ సినిమా గ్రాండ్ ఉంటుందంటూ ధీమా వ్య‌క్తం చేశారు. తార‌క్ కెరీర్ ప్రారంభంలో ఆది ఆడియో వేడుక‌కి తాను హాజ‌ర‌య్యాన‌ని గుర్తు చేశారు. టాలీవుడ్ లో ఐదారుగురు పెద్ద హీరోలు ఉన్నామ‌ని, ఇక నుంచి అంతా మారిపోతుంద‌ని, అన్ని ఫంక్ష‌న్ల‌లో అంద‌రం క‌నిపిస్తామ‌ని చెప్పుకొచ్చారు. త‌న‌కు రాజ‌కీయాలంటే పెద్ద‌గా తెలియ‌ద‌ని, కానీ ఒక్క‌సారిగా సీఎం అంటే భ‌య‌ప‌డ్డాన‌ని తెలిపారు. అయినా సినిమా బాగా వ‌చ్చింద‌ని, శ్రీమంతుడు త‌ర్వాత త‌న జీవితంలో మ‌రో ట‌ర్నింగ్ పాయింట్ కాబోతోంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా థియెట‌రిక‌ల్ ట్ర‌య‌ల‌ర్ ని ఎన్టీఆర్ ఆవిష్క‌రించారు.


Related News

Manchu-Vishnu

శ్రీ రెడ్డి వివాదంలో మంచు విష్ణు ఎంట్రీ

Spread the loveశ్రీరెడ్డి వ్య‌వ‌హారం ఇప్పుడిప్పుడే చ‌ల్లారేలా క‌నిపించ‌డం లేదు. మ‌రింత సెగ రాజుకునేలా క‌నిపిస్తోంది. కొత్త త‌గాదాకు తెర‌లేపుతోంది.Read More

shruthi

బ‌హిరంగంగానే శృతిహాస‌న్…!

Spread the loveసినిమా తార‌ల ప్రైవేట్ లైఫ్ ఎప్పుడూ ఆస‌క్తిగానే ఉంటుంది. అందులోనూ హీరోయిన్ల వ్య‌వ‌హారాలు మ‌రింత చ‌ర్చ‌నీయాంశాల‌వుతాయి. శృతిRead More

 • భ‌ర‌త్ అనే నేను మువీపై ఆస‌క్తిక‌ర రిపోర్ట్
 • శ్రీరెడ్డిపై కొరటాల శివ ఆవేద‌న‌
 • ఎన్టీఆర్ స్థానంలో నాని..
 • చిరంజీవి సైరాకి సై అంటున్న త‌మ‌న్న‌
 • జాతీయ అవార్డుల్లో టాలీవుడ్ స‌త్తా
 • అత‌డితో మ‌ళ్లీ జ‌త‌గ‌డుతున్న మ‌హేష్
 • శ్రీరెడ్డి సాధించింది…
 • సాయి ప‌ల్ల‌వి హ‌ద్దులు దాటేస్తోందా…?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *