చిరంజీవి సైరాకి సై అంటున్న త‌మ‌న్న‌

????????????????????????????????????
Spread the love

మిల్కీబ్యూటీకి మ‌రో ఛాన్స్ ద‌క్కింది. అది కూడా మెగాస్టార్ సినిమాలో కావ‌డం విశేషం. ఇప్ప‌టికే టాలీవుడ్ లో త‌మన్నా అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. బాహుబలిలో మెరిసిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత అడ‌పాద‌డ‌పా మాత్ర‌మే ఆమెకు అవ‌కాశాలు వ‌స్తున్నాయి. తాజాగా సైరా సినిమాలో ఆమెకు చాన్స్ రావ‌డంతో మ‌రో మెగా ప్రాజెక్ట్ లో చోటు ద‌క్కించుకున్న‌ట్టయ్యింది.

చారిత్ర‌క క‌థాంశంతో రూపొందిస్తున్న సైరా సినిమాలో చిరంజీవి సరసన నయన తార నటిస్తుంది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఓ కీల‌క‌పాత్రలో విజయ్ సేతుపతి న‌టిస్తున్నారు. అత‌డికి జోడీగా తమన్నా న‌టించ‌బోతోంది. తమన్నా పాత్ర గురించి ఇప్పటికే ఆమెకు వివరించగా, ఆమె అంగీక‌రించిన‌ట్టు టాలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. ఇందులో బిగ్‌ బి అమితాబ్‌, జగపతిబాబు, సుదీప్ వంటి ప్ర‌ముఖ న‌టులు న‌టిస్తున్నారు.


Related News

Manchu-Vishnu

శ్రీ రెడ్డి వివాదంలో మంచు విష్ణు ఎంట్రీ

Spread the loveశ్రీరెడ్డి వ్య‌వ‌హారం ఇప్పుడిప్పుడే చ‌ల్లారేలా క‌నిపించ‌డం లేదు. మ‌రింత సెగ రాజుకునేలా క‌నిపిస్తోంది. కొత్త త‌గాదాకు తెర‌లేపుతోంది.Read More

shruthi

బ‌హిరంగంగానే శృతిహాస‌న్…!

Spread the loveసినిమా తార‌ల ప్రైవేట్ లైఫ్ ఎప్పుడూ ఆస‌క్తిగానే ఉంటుంది. అందులోనూ హీరోయిన్ల వ్య‌వ‌హారాలు మ‌రింత చ‌ర్చ‌నీయాంశాల‌వుతాయి. శృతిRead More

 • భ‌ర‌త్ అనే నేను మువీపై ఆస‌క్తిక‌ర రిపోర్ట్
 • శ్రీరెడ్డిపై కొరటాల శివ ఆవేద‌న‌
 • ఎన్టీఆర్ స్థానంలో నాని..
 • చిరంజీవి సైరాకి సై అంటున్న త‌మ‌న్న‌
 • జాతీయ అవార్డుల్లో టాలీవుడ్ స‌త్తా
 • అత‌డితో మ‌ళ్లీ జ‌త‌గ‌డుతున్న మ‌హేష్
 • శ్రీరెడ్డి సాధించింది…
 • సాయి ప‌ల్ల‌వి హ‌ద్దులు దాటేస్తోందా…?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *