Main Menu

పెళ్లిపీట‌ల‌పైకి శ్వేతాబ‌సు

Spread the love

శ్వేతా బ‌సు ప్ర‌సాద్..ఈ బెంగాలీ భామ , టాలీవుడ్ లో ఓ సంచ‌ల‌నం. ‘కొత్త బంగారు లోకం’ చిత్రం కథానాయికగా ప‌రిచ‌యం అయ్యి కొద్దికాలానికే వ్య‌భిచారం విష‌యంలో క‌ల‌క‌లం రేపింది. టాలీవుడ్ లో దుమారం సృష్టిచింది. అయినా మొక్క‌వోని ప‌ట్టుద‌ల‌తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి కొన్ని సినిమాలు చేసింది.

చివ‌ర‌కు ఇప్పుడు పెళ్లికి సిద్ధ‌మ‌య్యింది. హీరోయిన్ శ్వేత బసు ప్రసాద్‌ వచ్చే నెల 13వ తేదీన వివాహం చేసుకోబోతుంది. బాలీవుడ్‌ నటుడు రోహిత్‌ మిట్టల్‌ను ఈమె పెళ్లాడబోతుంది. నాలుగేళ్లుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఈ వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. వీరి పెళ్లి బెంగాలీ, మార్వాడి సంప్రదాయ పద్ధతుల్లో జరగనుంది. వివాహం తర్వాత వారంలో ముంబాయిలో రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నారు. వివాహం గోవాలోనా? పూణేలోనా? ఎక్కడ జరగనుందన్న దానిపై స్పష్టత లేదు. ప్రస్తుతం శ్వేత తన స్నేహితులతో బాలిలో ఆనందంగా గడుపుతోంది.






Leave a Reply

Your email address will not be published. Required fields are marked *