Main Menu

సుక్కు, బ‌న్నీ కాంబినేష‌న్ లో షురూ

Spread the love

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ప్రాజెక్టుకు కమిట్టైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఆ తరువాతి ప్రాజెక్టుకూ ఓకే చెప్పేశాడు. త్రివిక్రమ్‌తో చేయబోతున్న చిత్రం ఇంకా ప్రీప్రొడక్షన్ పనుల్లోనే ఉన్నా, తరువాతి ప్రాజెక్టును బన్నీ ఫైనల్ చేయడం ఒకింత ఆసక్తి కలిగిస్తోంది. మైత్రీ మూవీస్ బ్యానర్ మీద క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌తో తరువాతి ప్రాజెక్టు ఓకే అయనట్టు ప్రకటన వెలువడం విశేషం.

‘నా పేరు సూర్య.. ’ చిత్రంతో తగిలిన ఎదురు దెబ్బ తరువాత బన్నీ మరో ప్రాజెక్టును ఫైనల్ చేయడానికి చాలా టైమే తీసుకున్నాడు. చాలా గ్యాప్ తరువాత త్రివిక్రమ్‌తో ప్రాజెక్టును ఫైనల్ చేసుకున్నాడు. మార్చి చివరిలోకానీ, ఏప్రిల్ ఫస్ట్‌వీక్‌లోగాని షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయ. బన్నీ సరసన నటించే హీరోయిన్ ఎవరన్న విషయంలోనూ దర్శక నిర్మాతలు ఇంకా ఓ నిర్ణయానికి వచ్చినట్టు కనిపించటం లేదు. హీరోయన్‌గా పూజాహెగ్డేకి అవకాశం దక్కొచ్చని టాలీవుడ్ టాక్. ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్ర విజయాల తరువాత బన్నీ- త్రివిక్రమ్ కలిసి చేస్తున్న మూడో ప్రాజెక్టుపై భారీ అంచనాలే ఉన్నాయి. కాంబినేషన్‌పై అంచనాలు పెరుగుతున్న టైంలోనే సుక్కూ డైరెక్షన్‌లో సినిమా చేయడానికి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో -బన్నీ ఏ గేర్‌లో వెళ్తున్నాడన్న అంశంపై అప్పుడే చర్చలు మొదలయ్యాయ.

సరిగ్గా పధ్నాలుగేళ్ల క్రితం ఆర్య సినిమాతో బన్నీకి బ్లాక్‌బస్టర్ హిట్టిచ్చాడు సుకుమార్. నిజానికి సుక్కూ డెబ్యూ మూవీయే కాదు, దర్శకుడిగా అతని స్టామినాను చూపించిన చిత్రం కూడా అదే. ఐదేళ్ల తరువాత సీక్వెల్‌గా చేసిన ఆర్య-2 సైతం బన్నీ కెరీర్‌కు ప్లస్ అవ్వడమే కాదు, బన్నీ పెర్ఫార్మెన్స్‌లోని వైవిధ్యాన్నీ ఆవిష్కరించింది. ఆ తరువాత ఎప్పటికప్పుడు బన్నీతో సుకుమార్ ప్రాజెక్టు చేయనున్నట్టు కథనాలు వెలువడటమే తప్ప కలిసి పని చేసింది లేదు. రంగస్థలం చిత్రంతో రామ్‌చరణ్‌కు బ్లాక్‌బస్టర్ హిట్టిచ్చిన సుకుమార్, తరువాతి ప్రాజెక్టును మహేష్‌తో చేయాల్సి ఉంది. కథపై కసరత్తు జరుగుతోందని అంటున్నారు. మహేష్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో మహర్షితో బిజీగా ఉన్నాడు. ఇది పూరె్తైన తరువాత మహేష్-సుక్కూ ప్రాజెక్టు పట్టాలెక్కాలి. ఇటు బన్నీ-త్రివిక్రమ్ ప్రాజెక్టూ ఇంకా పట్టాలెక్కలేదు. ఈ రెండు ప్రాజెక్టులు పూరె్తైన తరువాత బన్నీ-సుక్కూ ప్రాజెక్టు మొదలయ్యే అవకాశాలుంటాయ.


Related News

ర‌వితేజకి ఇద్ద‌రు!

Spread the love కాజల్‌ అగర్వాల్‌ మరో తెలుగు సినిమా చేసేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. ఆమె రవితేజకు జోడీగా నటించనుంది.Read More

ప్ర‌భాస్ పిరియాడిక్ మువీ..!

Spread the love ‘సాహో’ చిత్రీకరణలో వుండగానే ప్రభాస్‌ ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ సినిమాలోనూ నటిస్తున్నాడు. ఇదివరకే యూరప్‌లో కొంతభాగంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *