Main Menu

మ‌హేష్ న‌యా రికార్డ్..!

DGxbDXeWsAApxTw
Spread the love

భ‌య‌పెట్ట‌డం మాకు తెలుసంటూ బ‌య‌ట‌కు వ‌చ్చిన స్పైడ‌ర్ టీజ‌ర్ సంచ‌ల‌నంగా మారింది. కొత్త రికార్డులు సాధిస్తోంది. సౌత్ ఇండియ‌న్ ఇండ‌స్ట్రీ చ‌రిత్ర‌లోనే టాప్ లో నిలిచింది. అటు త‌మిళ్, ఇటు తెలుగు రెండు భాషల్లో రిలీజ్ టీజ‌న్ వ్యూస్ లో న‌యాసెన్సేష‌న్ గా మారింది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘స్పైడర్’ టీజర్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. రిలీజ్ చేసిన కొంతసేపటికే టాప్ ట్రెండింగ్స్ లో నిలిచిన ఈ టీజర్ 24 గంటలు గడిచేలోపే ఫేస్ బుక్, యూట్యూబ్‌లలో కలిపి 8.6 మిలియన్ డిజిటల్ వ్యూస్ దక్కించుకుని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఒక టీజర్‌కు ఒకరోజులో ఇంత భారీ రెస్పాన్స్ రావడం సౌతిండియాలో ఇతే తొలిసారి. దీన్ని బట్టి మహేష్ బాబు సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఇక మురుగ‌దాస్, మ‌హేష్ కాంబినేష‌న్ లో తొలిసారిగా వ‌స్తున్న ఈ సినిమా పెను సంచ‌ల‌నం కావ‌డం ఖాయ‌మ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ర‌కుల్ ప్రీత్ కూడా మొద‌టిసారిగా మ‌హేష్ తో జ‌త‌గ‌ట్టింది. దాంతో మ‌హేష్ అభిమానుల్లో సినిమా మీద అంచ‌నాలు మ‌రింత పెరిగిపోయాయి.






Related News

mahesh

ఫ్యాన్స్ కోసం మ‌హేష్ ఏం చేశాడో తెలుసా..?

Spread the loveటాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ కొంత రిజ‌ర్వుడు గా ఉంటార‌ని చాలామంది అబిప్రాయ‌ప‌డుతుంటారు. ఆయ‌న వ్య‌వ‌హార‌శైలి కూడాRead More

ANUSHKA

మ‌ళ్లీ అదే బాట‌లో అనుష్క‌

Spread the loveఅనుష్క త‌న‌కు బాగా అచ్చొచ్చిన మార్గాన్ని వెదుకుతున్నారు. ఇప్ప‌టికే ప‌లు సినిమాల‌తో ఆక‌ట్టుకున్న ఆమె మ‌రోసారి లేడీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *