Main Menu

స్పైడర్ 150 దాటేసింది…

spyeder
Spread the love

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన స్పైడర్‌ కలెక్షన్ల పరుగెడుతున్నాయి. బాక్సాఫీసు దగ్గర సినిమా సంత్రుప్తి మిగులుస్తోంది. సెప్టెంబరు 27న విడుదలైన ఈ సినిమా ఓ వర్గం నుంచి ప్రశంసలు అందుకుంది. మరోవైపు వసూళ్లులో జోరుగా ఉంది. కాగా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ.150 కోట్లు రాబట్టినట్లు యూనిట్‌ ప్రకటించింది. చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు ధన్యవాదాలు చెప్పింది.

స్పైడర్‌ తొలిరోజన రూ.51 కోట్లు రాబట్టింది. అమెరికాలో ప్రీమియర్‌ షో ద్వారా మిలియన్‌ డాలర్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. అక్కడ ప్రీమియర్‌ షో ద్వారా అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి ఐదు చిత్రాలు బాహుబలి 2,కబాలి, బాహుబలి ,ఖైదీ నెం.150ల తర్వాతి స్థానంలో నిలిచింది.

ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వం వహించిన స్పైడర్‌లో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా నటించారు. ఎస్‌.జె. సూర్య ప్రతినాయకుడి పాత్ర పోషించారు. హారిస్‌ జైరాజ్‌ స్వరాలు సమకూర్చారు. ఈ సందర్భంగా చిత్రం కొత్త సూపర్‌ హిట్‌ ప్రోమోను విడుదల చేశారు.






Related News

sunny-87-1024x682

స‌న్నీలియోన్ కి అనారోగ్యం

Spread the loveపోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ స్టార్ వ‌ర‌కూ ప‌రిణ‌తి సాధించిన స‌న్నీలియోన్ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఆమెను హుటాహుటీనRead More

prabhas1

రెబ‌ల్ స్టార్ రైతు అయిపోతున్నాడు..

Spread the loveటాలీవుడ్ రెబ‌ల్ స్టార్ న‌యా రూపంలో ద‌ర్శ‌న‌మివ్వ‌బోతున్నాడు. ప్రభాస్‌ ప్రస్తుతం దుబాయ్ లో సాహో’ చిత్ర షూటింగ్‌లోRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *