ప్రెసిడెంట్ పై ఫైర్ అయిన బాలీవుడ్ బ్యూటీ

sonam tweer
Spread the love

బాలీవుడ్ బ్యూటీ ఫైర‌య్యింది. ట్విట్ట‌ర్ సాక్షిగా ఘాటు కౌంట‌ర్ ఇచ్చింది. అమెరికా అధ్య‌క్షుడి మీద మండిప‌డింది. స్టార్ హీరోయిన్ సోన‌మ్ క‌పూర్ ట్వీట్ ఇప్పుడు హ‌ల్ చ‌ల్ చేస్తోంది దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ‘పిచ్చివాడు’ అని సోన‌మ్ చేసిన కామెంట్ హాట్ టాపిక్ అవుతోంది. ఆమె ఇంత తీవ్రంగా ఫైర్ కావ‌డానికి అమెరికాకు చెందిన ప్రముఖ హాస్యనటి, టీవీ కార్యక్రమాల వ్యాఖ్యాత ఎలెన్‌ డిజెనెరస్‌ చేసిన ట్వీటే కారణం. ఎలెన్‌ తన ట్విటర్‌ అకౌంట్‌లో ఒక ఫోటోను పోస్టు చేసింది. అందులో ‘మన అధ్యక్షుడు ఏనుగులు, మిగతా జంతువుల వేటకు అనుమతిచ్చాడు. ఇది భయానకమైన విషయం, మనందరం కలసికట్టుగా దీన్ని వ్యతిరేకిద్దాం’ అని ఉంది. అంతేకాకుండా ‘ఏనుగుల పట్ల దయగా ఉండండి’ అనే సందేశాన్ని వ్యాప్తి చేయాల్సిందిగా ఆమె తన అభిమానులందరినీ కోరింది.

అందుకు సోనమ్‌ స్పందిస్తూ ‘వేటాడటం భారతదేశంలో చట్టవిరుద్ధం. ఈ విషయంలో ప్రపంచం మమ్మల్ని చూసి నేర్చుకోవాల్సి ఉంది. వేటను అనుమతించిన ట్రంప్‌ ఒక పిచ్చివాడు’ అని ట్విట్‌ చేసింది. ఇప్పుడే కాదు గతంలోనూ మెరిల్‌ స్ట్రీప్‌ని ‘ఓవర్‌ రేటెడ్‌ నటి’ అన్నందుకు ట్రంప్‌ను తీవ్రంగా విమర్శించింది. ట్రంప్‌ను ఉద్దేశిస్తూ ‘మన నాయకులకు కనీసం తెలివి అనే రూపం అయినా ఉంటుంది, కానీ ఇతడు మాత్రం జోకర్‌’ అంటూ ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం సోనమ్‌ కపూర్‌ ‘వీరే ది వెడ్డింగ్‌’ చిత్రంలో నటిస్తోంది. ఇందులో సోనమ్‌తో పాటు కరీనా కపూర్‌ ఖాన్‌, స్వర భాస్కర్‌ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది జూన్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమ‌రికా ప్రెసిడెంట్ పై సోన‌మ్ స్పంద‌న మాత్రం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.


Related News

DY4IkDSW4AE8pbm

మెగా ఫ్యామిలీ లుంగీల క‌థ తెలుసా..!

Spread the loveమెగాస్టార్ ఫ్యామిలీ లుంగీల వెంట‌ప‌డింది. అయితే అది ఇప్పుడిప్పుడే కాదండోయ్..చిరంజీవి కాలం నుంచి ఆ స‌ర‌దా ఉంది.Read More

Rakul-Preet-Singh-Images

ర‌కుల్ ఆయ‌న‌పై మ‌న‌సు ప‌డింది…!

Spread the loveటాలీవుడ్ లో రెండేళ్ల క్రితం ర‌కుల్ హ‌వా క‌నిపించింది. కానీ అంత‌లోనే ఆశ‌లు ఆవిర‌య్యాయి. వెంక‌టాద్రి ఎక్స్Read More

 • రాజ‌మౌళి కోసం స్పీడ్ పెంచిన త్రివిక్ర‌మ్
 • మెగాస్టార్ ముహూర్తం పెట్టేశాడు…
 • పూజాగానంలో టాలీవుడ్
 • గొల్ల‌భామ‌పై క్లారిటీ
 • చీటింగ్ కేసులో మ‌రో హీరోయిన్
 • ప్రెసిడెంట్ పై ఫైర్ అయిన బాలీవుడ్ బ్యూటీ
 • చైనా వైపు చిరంజీవి చూపు
 • అన‌సూయ బ్యాక్ గురించి ఆస‌క్తిక‌ర కామెంట్స్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *