Main Menu

స‌మంత ముస‌లిద‌యిపోతోంది…!

Spread the love

పెళ్లి త‌ర్వాత అక్కినేని స‌మంతా ఆస‌క్తికర పాత్ర‌ల‌కు మొగ్గు చూపుతోంది. గ‌తానికి భిన్నంగా ఢీ గ్లామ‌రస్ రోల్స్ కి కూడా సిద్ధ‌మ‌వుతోంది. పాత్ర‌కు ప్రాధాన్య‌త ఉంటే చిన్న పాత్ర‌ల‌కు కూడా సిద్ధ‌ప‌డ‌డం మ‌హాన‌టి ద్వారా రుజువ‌య్యింది. ఇక తాజాగా ఓ వృద్ధురాలి పాత్ర‌లో న‌టించేందుకు రంగం సిద్ధమ‌య్యింద‌నే ప్ర‌చారం సాగుతోంది.

ఈ విష‌యాన్ని స‌మంత కూడా ప్ర‌క‌టించింది. అయితే సూటిగా చెప్ప‌కుండా తానో ఆస‌క్తిక‌ర పాత్ర పోషించ‌బోతున్న‌ట్టు ట్వ‌ట్ట‌ర్ లో వెల్ల‌డించింది. ఇటీవల రంగస్థలం సినిమాలో అచ్చ తెలుగు పల్లెటూరి ఆడపడుచులా కనిపించి ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్న సామ్.. మరో ఛాలెంజింగ్ రోల్‌కి సిద్ధమవుతోందట. ఈ విషయాన్ని స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించింది.

‘‘చాలా చాలా ఆసక్తికరమైన క్యారెక్టర్ చేసేందుకు సిద్ధమవుతున్నా. దీని గురించి నేను చాలా భయపడుతున్నా.. రోజంతా నెర్వస్‌గా ఉన్నా. కానీ నేను ఛాలెంజ్‌ని ఎప్పటికీ ఒప్పుకోను. కొన్నిసార్లు.. నిజానికి చాలా సార్లు నువ్వు ఊహించుకున్న దానికంటే బలవంతురాలివి’’ అంటూ తన కొత్త సినిమా గురించి సామ్ ట్వీట్ చేసింది. అయితే ఇటీవల సామ్ 70 ఏళ్ల వృద్ధురాలిగా కనిపించబోతోందంటూ వార్తలు వచ్చాయి. అది ఈ సినిమానే అయి ఉంటుందని భావిస్తున్నారు. మ‌రి ముస‌లి స‌మంత ని జ‌నం ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.






Related News

స‌మంత 96

Spread the loveతమిళ చిత్రం ‘96’ హిట్టు టాక్ తెచ్చుకోవడంతో -టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఆలస్యం చేయకుండాRead More

మ‌హేష్ మార్చిలోనే..!

Spread the loveమహేశ్‌ బాబు త్వరలో చేయనున్న తాజా చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఆ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *