ముదురు హీరోకి దొరికిందట..

Indian Bollywood actor Salman Khan (2R) celebrates and wishes his fans Ramzan Eid Mubarak at his residence in Mumbai on July 18, 2015.  AFP PHOTO        (Photo credit should read STR/AFP/Getty Images)
Spread the love

బాలీవుడ్ ముదురు హీరోకి అమ్మాయి దొరికిందట. ఈ విషయాన్ని కండలవీరుడే స్వయంగా ప్రకటించాడు. స‌ల్మాన్ ఖాన్ పెళ్లి గురించి దేశ‌వ్యాప్తంగా చాలాకాలంగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. కానీ అతడి పెళ్లి మాత్రం పూర్తవుతున్న దాఖలాలు లేవు. పలువురి భామలతో ఆయనకు ముడిపెట్టినా ఆ ముచ్చట మాత్రం తీరడం లేదు. దాంతో స‌ల్మాన్ పెళ్లి గురించి జోకులు కూడా పేలుతుంటాయి. 50 ఏళ్లు దాటినా మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్‌గానే మిగిలిపోతుండడంతో మీడియాలోనూ కథనాల పరంపర కనిపిస్తుంటుంది.

ఇక తాజాగా సల్మాన్ ఖాన్ స్వయంగా సంచలనానికి తెరలేపాడు. ఆసక్తికర ట్వీట్ చేశాడు. `నాకు అమ్మాయి దొరికింది` అని చెప్పి స్వీట్ షాక్ ఇచ్చాడు. స‌ల్మాన్ ట్వీట్‌తో పెళ్లి వార్త‌లు మ‌ళ్లీ షురూ అయ్యాయి. కొంత‌కాలంగా స‌న్నిహితంగా ఉంటున్న లూలియా ఇటీవ‌లె స‌ల్మాన్‌కు దూర‌మైంది. ఈ నేప‌థ్యంలో స‌ల్మాన్ ఎవ‌రిని పెళ్లి చేసుకోబోతున్నాడంటూ నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు. ఇటీవ‌ల ద‌గ్గ‌రైన క‌త్రినను ఉద్దేశించే స‌ల్మాన్ ఈ ట్వీట్ చేసిన‌ట్టు కూడా కొంద‌రు అనుకుంటున్నారు. మ‌రోవైపు స‌ల్మాన్ చేసిన ఆ ట్వీట్ పెళ్లికూతురి గురించేనా అన్న చ‌ర్చ కూడా జ‌రుగుతోంది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *