Main Menu

చైనా వైపు చిరంజీవి చూపు

Spread the love

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా షూటింగ్ ఇప్ప‌టికే జాప్యం జ‌రిగింది. అనేక ఆటంకాల‌తో న‌త్త‌న‌డ‌క‌న సాగుతోంది. ఆగ‌ష్ట్ లో ప్రారంభించిన షూటింగ్ ఇప్ప‌టి వ‌ర‌కూ మొద‌టి షెడ్యూల్ మాత్ర‌మే పూర్తి చేసుకోగ‌లిగింది. ఇక ప్ర‌స్తుతం రెండో షెడ్యూల్ కోసం స‌న్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా చైనా వెళ్ల‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. సైరా మువీ సెకండ్ షెడ్యూల్ ని చైనాలో చిత్రీక‌రించ‌బోతున్నారు. దానికి త‌గ్గ‌ట్టుగా లొకేష‌న్స్ సెల‌క్ష‌న్స్ పూర్త‌య్యింద‌ని స‌మాచారం.

చరణ్ నిర్మాతగా రూపొందుతోన్న ‘సైరాస సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని చైనా భాష‌లో కూడా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. దానికి త‌గ్గ‌ట్టుగా కొంత షూటింగ్ పార్ట్ ఆ దేశంలో చేయ‌డానికి త‌గ్గ‌ట్టుగా ఏర్పాట్లు చేసుకున్నారు.

ఇప్ప‌టికే చైనాలో విడుదలైన ‘దంగల్’ .. ‘బజరంగీ భాయీజాన్స వంటి భార‌తీయ చిత్రాలు అనూహ్యమైన విజయాలను అందుకున్నాయి. అంతేకాకుండా చైనాలో చిత్రీకరణ జరుపుకునే చిత్రాలకు అక్కడి ప్రభుత్వం మంచి రాయితీలను కూడా అందిస్తోంది దానిని వినియోగించుకోవ‌డంలో భాగంగా షూటింగ్ ఏర్పాట్లు జ‌రుగుతున్న‌ట్టు యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన కథానాయికగా నయనతార నటిస్తుండగా, అమితాబ్ .. విజయ్ సేతుపతి ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు.






Related News

గూగుల్ లో ఎక్కువ మంది ఆ అమ్మాయినే వెదికారు..!

Spread the loveసోష‌ల్ మీడియా ప్ర‌భావంతో సెల‌బ్రిటీ అయిపోవ‌డం పెద్ద స‌మ‌స్య కాదు. చిన్న స్పెషాలిటీ ఉంటే చాలు ఇట్టేRead More

ఎన్టీఆర్ బ‌యోపిక్ ఆడియో వేదిక అక్క‌డే..!

Spread the loveటాలీవుడ్ లో నంద‌మూరి కుటుంబం అత్యంత ప్రతిష్టాత్మ‌కంగా భావిస్తున్న ఎన్టీఆర్ బ‌యోపిక్ రెడీ అవుతోంది. ఎంఎం కీర‌వాణిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *