Main Menu

సాయి ప‌ల్ల‌వి హ‌ద్దులు దాటేస్తోందా…?

Spread the love

ఇదే ప్ర‌చారం టాలీవుడ్ లో కొంత కాలంగా సాగుతోంది. అయితే ఆమె మాత్రం దానిని తోసిపుచ్చుతోంది. త‌న ప‌రిధి త‌న‌కు బాగా తెలుస‌ని చెబుతోంది. త‌న‌కు వ్య‌తిరేకంగా సాగే ప్ర‌చారాన్ని తాను ప‌ట్టించుకోన‌ని చెబుతోంది. తెలుగులో ఫిదా, ఎంసీఏ వంటి చిత్రాలతో సాయి ప‌ల్ల‌వికి గుర్తింపు వ‌చ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ శర్వానంద్‌తో నటిస్తోంది.

ఈ సినిమాకి గాను సాయిపల్లవి కోటి రూపాయలు పారితోషికం తీసుకున్నట్లు టాలీవుడ్ వ‌ర్గాల్లో గాసిప్స్ వినిపిస్తున్నాయి. అదే స‌మ‌యంలో కోలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తోంది. మ‌ళ‌యాళంతో మొద‌లు పెట్టి టాలీవుడ్ లోనూ తానేంటో నిరూపించుకుని ఇప్పుడు కోలీవుడ్ లో సూర్య‌, ధ‌నుష్ వంటి హీరోల స‌ర‌స‌న సినిమాలు చేస్తోంది.

ఈ నేప‌థ్యంలో త‌న పై సాగుతున్న ప్ర‌చారానికి చెక్ పెట్టాల‌ని సాయిపల్లవి నిర్ణ‌యించుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఆమె తాజా వ్యాఖ్య‌లున్నాయి. అవకాశాలు చాలానే వస్తున్నాయని, తనకు సరిపోయే పాత్రలను అంగీకరిస్తున్నట్లు తెలిపింది. ‘నా మీద వస్తున్న విమర్శలను నేను పట్టించుకోను. ఏ ఇతర హీరోయిన్లకు పోటీ కాదు. నా బలం, బలహీనత ఏమిటన్నది నాకు బాగా తెలుసు. ఎప్పుడు నేను నా హద్దుల్లోనే ఉంటున్నాను. పాత్రల ఎంపిక విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాన’ని సాయిపల్లవి పేర్కొంది.






Related News

టాలీవుడ్ లో మ‌రో సావిత్రి…

Spread the loveటాలీవుడ్ తెర‌పైకి తాజాగా మ‌రో సావిత్రి తెర‌మీద‌కు వ‌స్తోంది. ఇప్ప‌టికే మ‌హాన‌టి ద్వారా కీర్తి సురేష్ మంచిRead More

మ‌ల్టీస్టార‌ర్ మువీకి రాజమౌళి ముహూర్తం

Spread the love బాహుబలి లాంటి ప్రతిష్ఠాత్మక చిత్రం తరువాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించే భారీ మల్టీస్టారర్‌కు సన్నాహాలుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *