ప్రభాస్ ఫ్యాన్స్ కి నిరాశ తప్పదు..

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి మరోసారి నిరాశ తప్పేలా లేదు. బాహుబలి పేరుతో గడిచిన ఐదేేళ్లలో కేవలం రెండే సినిమాలలో ఈ హీరో దర్శనమిచ్చాడు. అయితే ఆ రెండూ ప్రపంచస్థాయిలో సంచలనం కావడంతో ఫ్యాన్స్ సంత్రుప్తి చెందారు. అయితే ఆ తర్వాత సిద్దమయిన సాహో ద్వారా వీలయినంత త్వరగా ప్రేక్షకుల ముందుకు వస్తాడని ఆశిస్తే అది కూడా జాప్యం జరుగుతోంది. దాంతో వచ్చే ఏడాది వరకూ ప్రభాస్ తెరమీద కనిపించే అవకాశం లేదనే సమచాారం చర్చనీయాంశం అవుతోంది.
ప్రస్తుతం డార్లింగ్ చేస్తున్న ‘సాహో’ టీజర్‌ను విడుదల చేశారు. కానీ ఆ తర్వాత అప్డేట్స్ లేవు. ప్రస్తుతం దుబాయ్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్ షూటింగ్లో పాల్గొంటున్నారు. త్వరలో శ్రద్ధా కపూర్ కూడా షూటింగ్లో జాయిన్ కానుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా హలీవుడ్ స్టంట్‌మాస్టర్ పని చేస్తున్నారు. ఎప్పుడో చిత్రీకరణ మొదలైంది. సమ్మర్‌లోనైనా ‘సాహో’ వస్తుందని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
కానీ వచ్చే ఏడాది వరకూ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదని తెలిసింది. 2019 సంక్రాంతికి ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ఆ తర్వాత సినిమా విడుదల చేయనున్నారు.ఇది ప్రభాస్ ఫ్యాన్స్ ని నిరాశలో ముంచే వార్తగానే చెప్పాలి.
Related News

రూటు మార్చిన కాజల్
Spread the loveటాలీవుడ్ చందమామ రూటు మార్చింది. టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా వున్న కాజల్ అగర్వాల్ ఐటెమ్ సాంగ్స్ చేసేందుకుRead More

పవన్ మాజీ భార్య రీ ఎంట్రీ
Spread the loveజనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. మరాఠీలో ‘ఇష్క్Read More