Main Menu

ఆర్ఆర్ఆర్ లో ఆస‌క్తిక‌ర అంశం అదే..

Spread the love

జ‌క్క‌న్న లేటెస్ట్ మువీలో అస‌లు ఆస‌క్తి ఏంటో తేలిపోయింది. స‌రికొత్త జాన‌ర్ లో సినిమాలు తీస్తూ అంద‌రినీ ఆక‌ట్టుకునే రాజ‌మౌళి తాజా మువీ ఇప్ప‌టికే హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేప‌థ్యంలో ఈ సినిమాకు సంబంధించిన స‌మాచారం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. బాహుబలి లాంటి భారీ చిత్రం తరువాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌ (వర్కింగ్‌ టైటిల్‌). టాలీవుడ్ టాప్‌ హీరోలు రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు కలిసి నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది. రాజమౌళితో పాటు ఇతర చిత్రయూనిట్ అంతా సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్‌ బైటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే ఈ సినిమా ఎనౌన్స్‌ అయిన దగ్గర నుంచి మూవీ పీరియాడిక్‌ డ్రామా అన్న టాక్‌ వినిపిస్తోంది.

ఈ విషయంపై చిత్రయూనిట్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే తాజాగా యన్‌.టి.ఆర్‌ ప్రమోషన్‌ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సంగీత దర్శకుడు కీరవాణి, ఆర్‌ఆర్‌ఆర్‌ స్టోరిపై హింట్‌ ఇచ్చారు. ఈ సినిమా పని తాను మార్చిలో ప్రారంభిస్తానన్న కీరవాణి, ఈ సినిమాలో తన మ్యూజిక్‌ పీరియడిక్‌, ట్రెండీల ఫ్యూజన్‌ల ఉండబోతుందన్నారు. దీంతో సినిమా కూడా పీరియాడిక్‌ జానర్‌లోనే తెరకెక్కుతుందన్న టాక్‌కు మరింత బలం చేకూరినట్టైంది. మరి ఇప్పటికైన చిత్రయూనిట్‌ స్పందిస్తారేమో చూడాలి.






Related News

మ‌హేష్ తో అర్జున్ రెడ్డి..!

Spread the loveవిజయ్ దేవరకొండను అర్జున్‌రెడ్డితో ఒక్కసారిగా స్టార్ హీరోను చేసిన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగ ప్రస్తుతం అదే అర్జున్‌రెడ్డినిRead More

ప్ర‌భాస్ కి ఆమె ఏం పంపిందో తెలుసా?

Spread the loveబాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ప్రస్తుతం ప్రభాస్ తాజా చిత్రం ‘సాహో’ లో హీరోయిన్ గా నటిస్తున్నRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *