వర్మ ఎన్టీఆర్ గా ఆయన రాణిస్తాడా?

RGV-Attack-Movie-Characters-Intro-Prakash-Raj-Jagapathi-More
Spread the love

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అలనాటి నటుడు ఎన్టీఆర్‌ జీవితాధారంగా లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ టైటిల్‌తో బయోపిక్‌ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రీల్‌ లైఫ్‌ ఎన్టీఆర్‌ పాత్రలో, ఆయన సతీమణి లక్ష్మీపార్వతి పాత్రలో ఎవరు నటించనున్నారు అన్న వివరాలు వర్మ ఇంకా వెల్లడించలేదు . అయితే ఎన్టీఆర్‌ పాత్రలో విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ నటించనున్నట్లు కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. తాజాగా దీనిపై వర్మ ఫేస్‌బుక్‌ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్‌ పాత్రలో ప్రకాశ్‌ రాజ్‌ నటించడంలేదని స్పష్టం చేశారు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రంలో ప్రకాశ్‌ రాజ్‌ ఎన్టీఆర్‌ పాత్రలో నటిస్తున్నట్లు కొన్ని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. అందులో ఏమాత్రం వాస్తవం లేదు. దీనిపై క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పటివరకు నటీనటులుగా ఎవ్వర్నీ ఎంపిక చేయలేదు. త్వరలోనే వాటి వివరాలు వెల్లడిస్తాను అని వర్మ ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రాన్ని ఫిబ్రవరిలో ప్రారంభించి అక్టోబర్‌లో విడుదల చేస్తానని వర్మ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు






Related News

sai dharam tej jawan

జవాన్ ముహూర్తం రెడీ

Spread the loveసుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ జంటగా బివిఎస్ రవి దర్శకత్వం వ‌హిస్తున్నచిత్రం ‘జవాన్’. ప్రముఖRead More

Mehreen-Pirzada-1

సీనియర్ హీరోతో మెహరీన్

Spread the loveయంగ్ హీరోలతో ప్రారంభించి ఇప్పుడు సీనియర్లకు చేరుకుంటోంది మోహరీన్. ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతోంది అందాల భామRead More

  • యూరప్ కి పవన్ కల్యాణ్..
  • పెళ్లికి పిలుస్తానని ప్రకటించిన రేణూదేశాయ్
  • పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి నిరాశ…
  • మహేష్ ఫ్యామిలీ ముచ్చట..
  • మామా అల్లుళ్ల మువీకి రెడీ..
  • వేశ్యల జీవితాలపై టార్చ్ లైట్..
  • రాజమౌళి కన్ఫర్మ్ చేసేశాడు..
  • నయా లుక్ తో ప్రభాస్
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *