నిరాశ ప‌రిచిన వ‌ర్మ‌

RGV-Sridevi
Spread the love

త‌మ అభిమాన న‌టిని కోల్పోయి నిరాశ‌లో ఉన్న వారికి కాసింత ఊర‌ట క‌ల్పిస్తాడ‌ని భావించిన రామ్ గోపాల్ వ‌ర్మ కూడా శ్రీదేవి ఫ్యాన్స్ ని నిరాశ ప‌రిచేశాడు. బ‌యో పిక్ ల స్పెషలిస్టుగా క‌నిపించే రామ్ గోపాల్ వ‌ర్మ త‌న అభిమాన న‌టి విష‌యంలో మాత్రం నిరాక‌రించేశాడు. దానికి ఆయ‌న చెబుతున్న కార‌ణం కూడా ఆశ్చ‌ర్యంగా ఉండ‌డం విశేషం.

శ్రీదేవి బయాపిక్ పై స్పందించిన వ‌ర్మ‌.విఖ్యాత న‌టి, తొలి సూప‌ర్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి మ‌ర‌ణం దేశ‌వ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానుల‌ను క‌లిచి వేసింది. శ్రీదేవిని దేవ‌త‌గా భావించే సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ కూడా ఎంతో ఆవేద‌న‌కు గుర‌య్యారు. శ్రీదేవి గురించి, ఆమెతో త‌న అనుబంధం గురించి వ‌రుస ట్వీట్లు చేశారు. ఆమె అనుమానాస్ప‌ద మృతి ప‌ట్ల కూడా ప్ర‌శ్నిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో శ్రీదేవి బ‌యోపిక్‌ను తెర‌కెక్కించే యోచ‌న‌లో కూడా వ‌ర్మ ఉన్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా ఈ వార్త‌ల‌పై వ‌ర్మ ట్వీట్ చేసి స్ప‌ష్టం ఇచ్చారు. శ్రీదేవి బ‌యోపిక్‌ను తెర‌కెక్కించే ఆలోచ‌న త‌న‌కు లేద‌ని తెలిపారు. అందుకు గ‌ల కార‌ణాన్ని కూడా వెల్ల‌డించారు. `నేను శ్రీదేవి బ‌యోపిక్‌ను తెర‌కెక్కిస్తున్నానంటూ ఓ వ‌ర్గం మీడియాలో వ‌స్తున్న వార్త‌లు నిజం కావు. అస‌లు ఆ ప్ర‌య‌త్నం చేయ‌డ‌మే అవివేకం. ఎందుకంటే శ్రీదేవిలా న‌టించ‌గ‌ల న‌టి ఒక్క‌రు కూడా లేర‌`ని వ‌ర్మ ట్వీట్ చేశారు. దాంతో శ్రీదేవీ బ‌యోపిక్ వ‌ర్మ నుంచి వ‌స్తే దాని ఫీల్ వేరుగా ఉంటుంద‌ని భావించిన వారికి నిరాశ త‌ప్ప‌డం లేద‌నే చెప్ప‌వ‌చ్చు.


Related News

DY4IkDSW4AE8pbm

మెగా ఫ్యామిలీ లుంగీల క‌థ తెలుసా..!

Spread the loveమెగాస్టార్ ఫ్యామిలీ లుంగీల వెంట‌ప‌డింది. అయితే అది ఇప్పుడిప్పుడే కాదండోయ్..చిరంజీవి కాలం నుంచి ఆ స‌ర‌దా ఉంది.Read More

Rakul-Preet-Singh-Images

ర‌కుల్ ఆయ‌న‌పై మ‌న‌సు ప‌డింది…!

Spread the loveటాలీవుడ్ లో రెండేళ్ల క్రితం ర‌కుల్ హ‌వా క‌నిపించింది. కానీ అంత‌లోనే ఆశ‌లు ఆవిర‌య్యాయి. వెంక‌టాద్రి ఎక్స్Read More

 • రాజ‌మౌళి కోసం స్పీడ్ పెంచిన త్రివిక్ర‌మ్
 • మెగాస్టార్ ముహూర్తం పెట్టేశాడు…
 • పూజాగానంలో టాలీవుడ్
 • గొల్ల‌భామ‌పై క్లారిటీ
 • చీటింగ్ కేసులో మ‌రో హీరోయిన్
 • ప్రెసిడెంట్ పై ఫైర్ అయిన బాలీవుడ్ బ్యూటీ
 • చైనా వైపు చిరంజీవి చూపు
 • అన‌సూయ బ్యాక్ గురించి ఆస‌క్తిక‌ర కామెంట్స్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *