Main Menu

రేణూ దేశాయ్ హృద‌యం ప‌గిలింది…

Renu
Spread the love

అవునంటోంది జ‌న‌సేనాని మాజీ భార్య‌. న‌టిగా, ద‌ర్శ‌కురాలిగా, టీవీ ప్ర‌యోక్త‌గా రాణించిన రేణూదేశాయ్ తాజాగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన క‌విత చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తన అభిప్రాయాలను పంచుకోవడంతోపాటు ఆంగ్లంలో రాసిన కవితలను ట్విటర్‌లో పోస్ట్‌ చేయడం రేణూ అల‌వాటు. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘డాలర్- ఏ ఫిగర్ ఆఫ్ స్పీచ్’ అనే టైటిల్‌తో కవితను, వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేశారు. దీన్ని అభిమానుల కోసం ట్విటర్‌లో షేర్‌ చేశారు. జ్ఞాపకాల సమాధులను తవ్వితీస్తూ..ముక్కలైన హృదయాన్ని విషాద సాహిత్యంగా అవిష్కరించిన వైనం అద్భుతంగా నిలిచింది. ఆ జ్ఞాప‌కాల‌ను ఇప్పుడు తిరిగి చూసుకుంటే తుప్పు ప‌ట్టిన క‌లం, దానిపై రాసుకున్న పేరు తుడిచిపెట్టుకుపోయానడం ఆమె ప్రస్తుత పరిస్థితికి అద్ధం పట్టింది.

ముక్క‌లైన హృద‌యం, రాసుకున్న లేఖ‌ల కాగిత‌పు ముక్క‌లు మాత్ర‌మే మిగిలాయంటూ తన జ్ఞాపకాలతో బాధాతప్త హృదయాన్ని ప్రస్తావించారు. క‌మ్ముకున్న మంచు క‌రిగిపోయి మ‌ళ్ళీ ఆ జ్ఞాప‌కాలు క‌ళ్ళెదుట నిలిచాయి. మ‌న‌సు లోతుల్లో పాతుకుపోయిన జ్ఞాప‌కాల‌ని మ‌ళ్ళీ త‌ట్టి లేపుతుంది. తిరిగి చూసుకుంటే..తుప్పు ప‌ట్టిన క‌లం, తుడిచిపెట్టుకుపోయిన పేరు. విధి ఎంత బ‌లీయమైన‌ది . ముక్కలైన హృదయం విషాద సాహత్యంగా అంటూ తన కవితను ముగించారు. ఎంతో బాధ‌తో, ఆవేద‌న‌తో కూడిన ఈ కవిత అభిమానులను ఆలోచింపచేస్తోంది.






Related News

665848-maheshbharat

మెగా ఫ్యామిలీతో క‌లిసి మ‌హేష్

Spread the loveఇప్ప‌టికే జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ ఓకే అయ్యింది. టాలీవుడ్ జ‌క్క‌న్న దానికి స‌న్నాహాల్లో ఉన్నారు.Read More

sunny-87-1024x682

స‌న్నీలియోన్ కి అనారోగ్యం

Spread the loveపోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ స్టార్ వ‌ర‌కూ ప‌రిణ‌తి సాధించిన స‌న్నీలియోన్ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఆమెను హుటాహుటీనRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *