టాలీవుడ్ లో మరో వారసుడు ఎంట్రీ

raviteja
Spread the love

టాలీవుడ్ లో మరో వారసుడు రంగంలోకి వస్తున్నాడు. ఇప్పటికే ఇద్దరు సోదరులను తెరమీదకు తెచ్చినా వారిద్దరూ విఫలమయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు స్వయంగా తనయుడిని రంగంలో దింపడానికి రవితేజ ఏర్పాట్లు చేసుకున్నారు. పలువురు స్టార్ హీరోలు తమ వారసులను సక్సెస్ బాట పట్టించి టాలీవుడ్ లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగానే రవితేజ కూడా సన్నాహాలు చేస్తున్నారు.

రవితేజ తాజా చిత్రం ‘రాజా.. ద గ్రేట్‌’ సినిమాలో మహాధన్‌ కనిపించనున్నాడనేది విశ్వసనీయ సమాచారం. దిల్‌ రాజు, శిరీశ్‌ కలిసి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి అనిల్‌ రావిపూడి దర్శకుడు. ఇందులో రవితేజ అంధుడిగా నటిస్తున్నారు. ఆయన చిన్నప్పటి సన్నివేశాల కోసం పలువురు బాలనటుల్ని పరిశీలించిన దర్శక నిర్మాతల దృష్టిలో మహాధన్‌ పడ్డాడనీ, అతనైతే ఆ పాత్రకు సరిగ్గా సరిపోతాడని భావించిన వాళ్లు.. రవితేజకు చెప్పడంతో, ఆయన సరేనన్నారనీ తెలిసింది. కాగా ఈ విషయాన్ని దర్శక నిర్మాతలు అధికారికంగా వెల్లడించలేదు. వాస్తవానికి ఈ సినిమాలో మహాధన్‌ నటిస్తున్నాడనే విషయాన్ని సినిమా విడుదల వరకు గోప్యంగా ఉంచాలని వారు భావించారనీ, అయితే ఈ లోగా ఆ విషయం లీక్‌ అయిందనీ ప్రచారం జరుగుతోంది. ‘బెంగాల్‌ టైగర్‌’ తర్వాత రెండేళ్ల విరామంతో ‘రాజా.. ద గ్రేట్‌’ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు రవితేజ. ఈ సినిమాతో ఆయన కుమారుడు ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.


Related News

jyotika-story_647_112517121159

జ్యోతికపై కేసు

Spread the loveసీనియర్ నటి, హీరో సూర్య సతీమణి జ్యోతికపై కేసు నమోదయ్యింది. చెన్నైలో ఆమెకు వ్యతిరేకంగా నమోదయిన కేసుRead More

Ram-Charans-Rangasthalam-beats-Stylish-Star-Allu-Arjuns-Naa-Peru-Surya-record

చెర్రీని క్రాస్ చేసిన అల్లు అర్జున్

Spread the loveమెగా హీరోల మధ్య ఆసక్తికర పోటీ సాగుతోంది. ఇప్పటికే వరుణ్ తేజ్‌ ‘తొలిప్రేమ’ తో మంచి మార్కులుRead More

 • షాక్ కి గురయిన చిరు
 • లంకె బిందెలాగ ఎంత సక్కగున్నావే…
 • ప్రభాస్ పూర్తిగా యూరప్ లోనే…
 • ప్రభాస్ గురించి నన్ను విసిగించకండి…
 • సైరా సినిమా నుంచి బిగ్ వికెట్ డౌన్
 • అనసూయకు షాక్
 • ముదురు హీరోకి దొరికిందట..
 • మూగమ్మాయి సమంత గుడ్ బై
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *