Main Menu

నేల టికెట్ గాడు ఎవరు…

Spread the love

కల్యాణ్‌ కృష్ణ…’సోగ్గాడే చిన్ని నాయనా’, ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ సినిమాలతో విజయాలు అందుకున్న దర్శకుడు. తన తదుపరి సినిమా రవితేజతో చేస్తున్నాడు. ఈ సినిమాకు ‘నేల టికెట్‌’ అనే టైటిల్‌ పరిశీలనలో వున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ కాజాగూడాలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ప్రారంభమైంది. రవితేజతోపాటు పలువురు హాస్య నటులపై కొన్ని సన్నివేశాలు చిత్రించారు. మాళవిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ‘ఫిదా’ సినిమాకు సంగీతం అందించిన శక్తికాంత్‌ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నాడు. చోటా కె ప్రసాద్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. రవితేజ తాజా సినిమా ‘టచ్‌ చేసి చూడు’ ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎస్‌ ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో రామ్‌ తాళ్ళూరి నిర్మిస్తున్నారు. ముకేశ్‌ కెమెరామెన్‌.






Related News

సందిగ్ధంలో స్టైలిష్ స్టార్

Spread the loveస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి క్లారిటీ క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌ల వ‌రుసగా ఫెయిల్యూర్స్ తో ఆయ‌నRead More

మిడ్ నైట్ మ‌సాజ్ కి వ‌స్తాన‌న్నాడు..!!!

Spread the loveబాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా రాధికా ఆప్టే వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశంగా ఉంటుంది. మంచి టాలెంట్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *