మూగమ్మాయి సమంత గుడ్ బై

samantha_6441
Spread the love

అక్కినేని వారి కోడ‌లు స‌మంత‌ మూగమ్మాయిగా నటించిన మువీకి ముగింపు పలికేసింది. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌రణ్ సరసన సమంత మూగమ్మాయిగా నటించింది. చెర్రీ బధిరుడి పాత్ర పోషించాడు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న `రంగ‌స్థ‌లం 1985` సినిమాలో తన పాత్ర కోసం సమంత తీవ్రంగతా శ్రమించింది. చివరకు షూటింగ్ లో భాగంగా వడదెబ్బకు కూడా గురయ్యింది. అనేక ఆటంకాలు అధిగమించి చివరకు షూటింగ్ లో తన పార్ట్ పూర్తి చేసింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపింది. `షూటింగ్ పూర్త‌యింది. `రంగస్థ‌లం` అనేది చాలా స్పెష‌ల్ టీమ్‌తో చేసిన చాలా ప్ర‌త్యేక‌మైన ప్ర‌యాణం. రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్ నిజ‌మైన స్టార్లు. భారీ విజ‌యం కోసం వెయిట్ చేస్తున్నాన‌`ని సమంత ట్వీట్ చేసింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తిచేసుకుని వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *