పైసా వసూల్ బాట‌లో రంగ‌స్థ‌లం

ramcharan
Spread the love

వాయిదాల పద్ధతిలో సినిమాలు విడుదల కావడం తెలుగులో అలవాటైన వ్యవహారమే. ముందు నిర్ణయించిన తేదీకి విడుదలయ్యే సినిమాల్ని వేళ్లమీదే లెక్కపెట్టొచ్చు. కొన్ని కొన్ని సినిమాలైతే ఎన్నిసార్లు వాయిదాలు పడుతుంటాయో లెక్కే లేదు. అయితే ఇప్పుడు తెలుగు చిత్రసీమలో అందుకు పూర్తి భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. సినిమాలు విడుదల తేదీ కంటే ముందుగానే వచ్చేస్తున్నాయి. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన పైసా వసూల్‌ నెల రోజుల ముందు విడుదలవుతోంది.

ఆ సినిమాని మొదట సెప్టెంబరు 29న విడుదల చేయాలనుకొన్నారు. కానీ చిత్రం అనుకొన్న సమయానికంటే ముందే పూర్తయ్యే పరిస్థితి కనిపించడంతో సెప్టెంబరు 1న విడుదల అంటూ కొత్త తేదీని ప్రకటించారు. ఎప్పుడెప్పుడా అని సినిమాల గురించి ఎదురు చూస్తున్న అభిమానులకి అంతకంటే ఏం కావాలి? ఇప్పుడు రామ్‌చణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న రంగస్థలం కూడా అదే తరహాలోనే నెల రోజుల ముందే విడుదల కానుందని ప్రచారం సాగుతోంది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలనుకొన్నారు. అయితే సంక్రాంతికి పోటీ ఎక్కువగానే కనిపిస్తుండడంతో పాటు, ఇప్పటికే 60శాతానికిపైగా సినిమా పూర్తవడంతో డిసెంబరులోనే విడుదల చేసే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్టు తెలిసింది. సంక్రాంతికి పవన్‌ కల్యాణ్‌ సినిమా కూడా విడుదలయ్యే సూచనలు కనిపిస్తుండడంతోనే రామ్‌చరణ్‌ సినిమాని ముందుకు తీసుకొచ్చేందుకు ఆచిత్ర నిర్మాతలు ఆలోచిస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మరి అది సాధ్యమవుతుందో లేదో చూడాలి.






Related News

imgnamitha

ఆమెకు కూడా ప్రభాస్ ఇష్టమట..

Spread the loveకొద్దిరోజుల క్రితం ఓ ఇంటిదయిన నమిత తాజాగా ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేసింది. అందులోనూ యంగ్ రెబల్ స్టార్Read More

prabhas

ప్రభాస్ పెళ్లి గురించి నన్ను అడగొద్దు…

Spread the loveత్వరలోనే ప్రభాస్ పెళ్లి, పెళ్లి కూతురిని చూస్తున్నాం అంటూ చాలాకాలంగా చెప్పుకుంటూ వస్తున్న రెబల్ స్టార్ క్రుష్ణంRead More

  • టాప్ లెస్ గా మహేష్ హీరోయిన్
  • ఆ డైరెక్టర్ తో తగాదా గురించి తమన్నా ఏమందంటే..
  • బాలీవుడ్ వైపు కన్నేసిన బ్యూటీ
  • చిరంజీవి మీసాల వెనుక అసలు కథ ఇది…
  • అజ్ఞాతవాసి రిజల్ట్ తో ఎన్టీఆర్ కలవరం
  • వచ్చే నెలలో టచ్ చేస్తున్న రవితేజ
  • హెబ్బా పటేల్ 24 ముద్దులు
  • ప్రభాస్ కష్టం గురించి అనుష్క..
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *