Main Menu

రానా ‘హౌస్ ఫుల్’

Spread the love

టాలీవుడ్ భ‌ల్లాల దేవుడికి బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఈ టాలెస్ట్ స్టార్ కి గుర్తింపు రావ‌డంతో అడ‌పాద‌డ‌పా బాలీవుడ్ లో కూడా మెరుస్తున్నాడు. తాజాగా మ‌రోసారి బాలీవుడ్ క్రేజీ మువీలో ఛాన్స్ కొట్టేశాడు. అక్ష‌య్ కుమార్‌, రితేష్‌దేశ్‌ముఖ్‌, బాబీ డియోల్‌ ప్రధాన తారాగణంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘హౌస్‌ఫుల్‌ 4’. గత ఏడాది మీటూ ఉద్యమం ఊపందుకున్న తరుణంలో ఈ చిత్ర దర్శకుడు సాజిద్‌ ఖాన్‌పై పలు వేధింపు ఆరోపణలు వచ్చాయి. పలువురు నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించారు. దాంతో చిత్ర నిర్మాణాన్ని కొద్ది కాలం ఆపేసి దర్శకుడు ఆ చిత్రం నుంచి తొలగించారు. కాగా, ప్రస్తుతం ఈ చిత్రానికి ఫర్హాద్‌ సామ్జీ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మధ్యలో ఈ చిత్ర బాధ్యతలు తీసుకోవడం సవాల్‌గా మారిందని పేర్కొన్నారు. ఇందులో రానా దగ్గుబాటి పాత్ర చాలా కీలకమైందని పేర్కొన్నారు. ద‌గ్గుబాటి రానా ముఖ్య‌పాత్ర పోషిస్తుండ‌డంతో ఇప్పుడు హౌస్ ఫుల్ 4 ప్రాజెక్ట్ కి క్రేజ్ ఏర్ప‌డింద‌ని భోగ‌ట్టా






Related News

మ‌హేష్ తో అర్జున్ రెడ్డి..!

Spread the loveవిజయ్ దేవరకొండను అర్జున్‌రెడ్డితో ఒక్కసారిగా స్టార్ హీరోను చేసిన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగ ప్రస్తుతం అదే అర్జున్‌రెడ్డినిRead More

ప్ర‌భాస్ కి ఆమె ఏం పంపిందో తెలుసా?

Spread the loveబాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ప్రస్తుతం ప్రభాస్ తాజా చిత్రం ‘సాహో’ లో హీరోయిన్ గా నటిస్తున్నRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *