Main Menu

గాయ‌ప‌డ్డ రామ్ చ‌ర‌ణ్, నిలిచిపోయిన షూటింగ్

Spread the love

మెగా ప‌వ‌ర్ స్టార్ గాయ‌ప‌డ్డారు. షూటింగ్ లో ఉండ‌గా గాయాలు పాలుకావ‌డంతో క‌ల‌క‌లం రేగింది. హ‌ఠాత్తుగా షూటింగ్ నిలిపివేశారు. ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్ట్ చిత్రీక‌ర‌ణ‌కు ఆటంకం క‌లిగింది.

రామ్ చరణ్‌, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పుణేలో జరుగుతోంది. అయితే జిమ్‌లో కసరత్తులు చేస్తున్న రామ్‌చరణ్‌ గాయపడటంతో షూటింగ్ వాయిదా పడింది. చరణ్‌ గాయం కారణంగా షూటింగ్ వాయిదా వేస్తున్నట్టుగా తెలిపిన చిత్రయూనిట్ మూడు వారాల తరువాత తిరిగి షూటింగ్ ప్రారంభమవుతుందని తెలియజేశారు.

డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో చరణ్‌కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా, ఎన్టీఆర్‌కు జోడిగా విదేశీ భామ డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ నటించనున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను 2020 జూలైలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.






Related News

ర‌వితేజ వ‌స్తున్నాడు…!

Spread the loveరవితేజ ‘అమర్‌ అక్బర్‌ అంటోనీ’ చిత్రం అపజయం నుంచి ఇంకా కోలుకోలేదు. ఈ సినిమా తర్వాత ఆయనRead More

ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌తో బిజినెస్ చేసేశారు..!

Spread the loveతెలుగులోనూ న‌టించిన బాలీవుడ్ బ్యూటీ వాపోయింది. త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌తో బిజినెస్ చేసుకుంటున్నారంటూ మండిప‌డింది. దాంతో దిశాప‌ఠానీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *