Main Menu

ర‌జ‌నీ తో మ‌ళ్లీ ఇద్ద‌రు!

Spread the love

రజనీకాంత్‌ హీరోగా తాజాగా ఓ చిత్రం పట్టాలెక్కబోతుంది. మురుగదాస్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్‌ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. వాళ్లే నయన తార, కీర్తి సురేశ్‌. ఈ విషయాన్ని చిత్రవర్గాలు సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించాయి. రజనీ నటించిన ‘పేట’ చిత్రంలోనూ త్రిష, సిమ్రాన్‌ ఇద్దరు కథానాయికలతో నటించారు.

‘పేట’ విజయం సాధించిన నేపథ్యంలో కొత్త చిత్రంలోనూ ఇద్దరు కథానాయికలను ఎంపిక చేశారు దర్శకుడు మురుగదాస్‌. కీర్తి, రజనీ కలిసి నటించబోతుండడం ఇదే తొలిసారి. గతంలో నయనతార, రజనీ కాంబినేషన్‌లో ‘చంద్రముఖి’, ‘కథానాయకుడు’ చిత్రాలు వచ్చాయి. కొత్తగా చేస్తున్న ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించనున్నారు. ఇదో మాస్‌ ఎంటర్‌టైనర్‌ అని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చిత్రబృందం స్పష్టం చేసింది. లైకా ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది






Related News

ర‌వితేజకి ఇద్ద‌రు!

Spread the love కాజల్‌ అగర్వాల్‌ మరో తెలుగు సినిమా చేసేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. ఆమె రవితేజకు జోడీగా నటించనుంది.Read More

ప్ర‌భాస్ పిరియాడిక్ మువీ..!

Spread the love ‘సాహో’ చిత్రీకరణలో వుండగానే ప్రభాస్‌ ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ సినిమాలోనూ నటిస్తున్నాడు. ఇదివరకే యూరప్‌లో కొంతభాగంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *