Main Menu

హిజ్రాల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ ..!

Spread the love

త‌ల్లికి గుడిక‌ట్టినా, రైతుల కోసం రోడ్డెక్కినా, జ‌ల్లి క‌ట్టు జ‌గ‌డంలో ముందు నిలిచినా రాఘ‌వా లారెన్స్ ఓ సంచ‌ల‌నం. కోలీవుడ్, టాలీవుడ్ అన్న బేధం లేకుండా టాలెంట్ తో స‌త్తా చాటిన స్టార్. డ్యాన్స‌ర్ గా రంగ ప్ర‌వేశం చేసిన కొరియోగ్రాఫ‌ర్ నుంచి ద‌ర్శ‌కుడు, హీరోగా మారి ఆల్ రౌండ‌ర్ గా నిరూపించుకున్నాడు. అయితే ఇప్పుడో ఆస‌క్తిక‌ర కామెంట్ తో మరోసారి తెర‌మీద‌కు రావ‌డం విశేషం. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘శివలింగ’. పి. వాసు దర్శకత్వంలో అభిషేక్‌ ఫిలిమ్స్‌ పతాకంపై రమేశ్ పి. పిళ్లై నిర్మించిన ఈ చిత్రాన్ని సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అధినేత మల్కాపురం శివకుమార్‌ తెలుగులో విడుదల చేస్తున్నారు. 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా లారెన్స్ మీడియ‌కు చెప్పిన విశేషాలు ఆశ్చ‌ర్యంగా మారాయి.

‘‘మా ట్రస్ట్‌ తరపున హిజ్రాలూ పని చేస్తున్నారు. ‘కాంచన’ సినిమా వచ్చాక హిజ్రాలు కూడా మా బృందంలో భాగమయ్యారు. వాళ్ల సంఘానికి నన్ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా పెట్టుకొన్నారు. అలాగే దివ్యాంగులకు నేనే బ్రాండ్‌ అంబాసిడర్‌ను. నా సినిమా ఏదైనా మొదలవుతుందంటే హిజ్రాల సంఘం బ్యాంక్‌ అకౌంట్‌లో కొంత డబ్బు వేస్తాను. ఆ సెంటిమెంట్‌ నాకు వర్కవుట్‌ అవుతోంది. నా దృష్టిలో వాళ్లు అదృష్టలక్ష్ములు!’’ అంటూ రాఘ‌వ లారెన్స్ చెప్పుకొచ్చారు.

దాంతో రాఘ‌వ లారెన్స్ వ్య‌వ‌హారం మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. సినిమా కోసం చెప్పిన మాట‌ల మాదిరి కాకుండా నిజంగానే ఆయా వ‌ర్గాల‌కు అండ‌గా నిల‌వ‌డం ద్వారా అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు.






Related News

మ‌హేష్ తో మువీ గురించి…!

Spread the loveదర్శకుడు అనిల్‌ రావిపూడి చెప్పేశారు. మహేశ్‌బాబుతోనే తన తదుపరి సినిమా అని. అయితే… ఈ విషయాన్ని నేరుగాRead More

ఉగాది నాడు మ‌హేశ్

Spread the loveసూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ఉగాదికి వ‌స్తున్నాడు. అభిమానుల‌ను అల‌రించేందుకు సిద్ద‌మ‌వుతున్నాడు. అందుకు త‌గ్గ‌ట్టుగా మ‌హ‌ర్షి టీజ‌ర్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *