Main Menu

ప్ర‌భాస్ పిరియాడిక్ మువీ..!

Spread the love

‘సాహో’ చిత్రీకరణలో వుండగానే ప్రభాస్‌ ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ సినిమాలోనూ నటిస్తున్నాడు. ఇదివరకే యూరప్‌లో కొంతభాగం తెరకెక్కించారు. ఇప్పుడు హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ మొదలవ్వబోతోంది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో కొత్త షెడ్యూల్‌కి శ్రీకారం చుట్టనుంది టీమ్‌. దాదాపు 15 రోజుల పాటు కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తారు. ఇందుకోసం ప్రొడక్షన్‌ డిజైనర్‌ ఆర్‌.రవీందర్‌ ఓ ప్రత్యేకమైన సెట్‌ తీర్చిదిద్దారు. ఈ సెట్లోనే ఇప్పుడు షూటింగ్‌ జరగబోతోంది. ఇదో పిరియాడికల్‌ డ్రామా. సెట్స్‌ అవసరం చాలా ఎక్కువ. కథానుగుణంగా సెట్స్‌ని రూపొందించడానికి రవీందర్‌ పెద్ద ఎత్తున కసరత్తులు చేశారు. యూరప్‌లో కూడా కొన్ని సెట్స్‌ వేయబోతున్నట్టు తెలుస్తోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2020 వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.






Related News

ర‌వితేజ వ‌స్తున్నాడు…!

Spread the loveరవితేజ ‘అమర్‌ అక్బర్‌ అంటోనీ’ చిత్రం అపజయం నుంచి ఇంకా కోలుకోలేదు. ఈ సినిమా తర్వాత ఆయనRead More

ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌తో బిజినెస్ చేసేశారు..!

Spread the loveతెలుగులోనూ న‌టించిన బాలీవుడ్ బ్యూటీ వాపోయింది. త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌తో బిజినెస్ చేసుకుంటున్నారంటూ మండిప‌డింది. దాంతో దిశాప‌ఠానీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *