Main Menu

రికార్డుల ‘సాహో’

Spread the love

బాహుబ‌లి ఇమేజ్ తో ప్ర‌భాస్ మార్కెట్ అమాంతంగా పెరిగింది. ఆ త‌ర్వాత వ‌స్తున్న సినిమాపై దాని ప్ర‌భావం క‌నిపిస్తోంది. తాజాగా సాహో సినిమాకి వ‌స్తున్న ఆఫ‌ర్ల‌తో నిర్మాత ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ప్రభాస్‌ హీరోగా రూపొందుతోన్న ‘సాహో’ చిత్రం విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ప్రస్తుతం ఇంకా చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాపై బయ్యర్లు కళ్లు పడ్డాయి. ఓవర్‌సీస్‌ హక్కులు భారీ రేటుకు దక్కించుకున్నారు. ఏకంగా రూ. 36 కోట్లకు అమ్ముడయ్యాయి. దుబాయికి చెందిన ఫర్‌ ఫిల్మ్స్‌ కంపెనీ ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులను కొనుగోలు చేసింది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని ఈ సంస్థే విడుదల చేయబోతుంది. అయితే ఇందులో ఇంకా చైనా మార్కెట్‌ భాగం కాలేదు.

ఇటీవలే ఈ సినిమా హిందీ థియేట్రికల్‌ హక్కులు ఏకంగా రూ.125 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇప్పుడు ఓవర్‌సీస్‌ రైట్స్‌ భారీ ధర దక్కించుకోవడం విశేషం. ఈ యాక్షన్‌, థ్రిల్లర్‌లో శ్రద్ధాకపూర్‌ కథానాయిక. సుజీత్‌ దర్శకుడు. ‘బాహుబలి’ చిత్రాల తర్వాత ప్రభాస్‌ నటిస్తున్న సినిమా కావడంతో ‘సాహో’పై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో అభిమానులను అలరించేలా సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఆగస్టు 15న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.






Related News

ర‌వితేజకి ఇద్ద‌రు!

Spread the love కాజల్‌ అగర్వాల్‌ మరో తెలుగు సినిమా చేసేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. ఆమె రవితేజకు జోడీగా నటించనుంది.Read More

ప్ర‌భాస్ పిరియాడిక్ మువీ..!

Spread the love ‘సాహో’ చిత్రీకరణలో వుండగానే ప్రభాస్‌ ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ సినిమాలోనూ నటిస్తున్నాడు. ఇదివరకే యూరప్‌లో కొంతభాగంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *