Main Menu

పూజాహెగ్డే ప్రేమ‌క‌థ‌లు

Spread the love

టాలీవుడ్ లో ప్ర‌స్తుతం పూజాహెగ్డే హ‌వా న‌డుస్తోంది. ఆరంగేట్రంలో అవ‌స్థ‌లు ప‌డిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం అగ్ర‌క‌థ‌నాయ‌కులంద‌రితో న‌టిస్తోంది. ప‌లు అవకాశాలు చేజిక్కించుకుంటోంది. ముకుంద సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది పూజాహెగ్డే. ఆ మూవీ అంత పెద్దగా వసూళ్లు రాబట్టకపోయినా పూజా నటనకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. దీంతో వెంటనే అమ్మడుకి బాలీవుడ్‌లో కూడా ఛాన్స్ వచ్చింది. అక్కడ మూవీ ప్లాప్ కావడంతో తిరిగి మళ్లీ తెలుగు సినిమాల్లో బిజీగా ఉంది. అల్లు అర్జున్‌తో దువ్వాడ జగన్నాథం, త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ సినిమాల్లో నటించింది. తాజాగా మహేష్‌బాబు నటిస్తోన్న మహర్షి మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇటీవలే ఆమె ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించింది. తనకు ప్రేమ కథలంటే చాలా ఇష్టం అని చెప్పింది పూజా. ప్రస్తుతం పెద్ద హీరోలతో కమర్షియల్ యాక్షన్ చిత్రాలలోనే నటిస్తున్నప్పటికీ నాకు వ్యక్తిగతంగా ప్రేమకథలంటే చాలా ఇష్టమని.. అలాంటి కథలు తనదగ్గరకు వస్తే మాత్రం అసలు వదులుకోనని చెప్పింది. ప్రేమ గురించి మ‌న‌సులో మాట కూడా చెప్పింది. ప్రేమించ‌బ‌డడం అంద‌రికీ సాధ్యం కాద‌ని, అందుకే ప్రేమ క‌థ‌ల‌ను తాను ఆస్వాదిస్తాన‌ని వెల్ల‌డించిందీ భామ‌.






Related News

స‌మంత 96

Spread the loveతమిళ చిత్రం ‘96’ హిట్టు టాక్ తెచ్చుకోవడంతో -టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఆలస్యం చేయకుండాRead More

మ‌హేష్ మార్చిలోనే..!

Spread the loveమహేశ్‌ బాబు త్వరలో చేయనున్న తాజా చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఆ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *