దీపావళికి వస్తున్న పవన్ కల్యాణ్

pawan kalyan
Spread the love

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న 25వ చిత్రం ఇటీవల ఫిలిం సిటీలో భారీ షెడ్యూల్‌ను జరుపుకుంది. తాజాగా విదేశాల్లో పాటల చిత్రీకరణ జరుపుతున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ అక్కడే వుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా మొదలై చాలా రోజులవుతున్నా కూడా ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించకపోవడం కాస్త నిరాశకు గురి చేస్తోంది. త్రివిక్రమ్ మేకింగ్ స్టయిల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను దీపావళికి విడుదల చేసేందుకు సన్నాహాలు జరుపుతున్నారట. ఇప్పటికే ఈ సినిమా టైటిల్‌పై రకరకాల పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. దేవుడే దిగివచ్చినా, ఇంజనీర్‌బాబు వంటి టైటిల్స్ ప్రచారంలో వుండగా తాజాగా మరో టైటిల్ వెలుగులోకి వచ్చింది. అదే అజ్ఞాతవాసి. ప్రస్తుతం ఈ టైటిల్‌నే యూనిట్ ఓకే చేసేలా ఉందంటూ తెగ ప్రచారం జరుగుతోంది. టైటిల్ ఏదిఏమైనా ఫస్ట్‌లుక్ మాత్రం దీపావళికి విడుదల చేసి జనవరి 10న సంక్రాంతి కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.






Related News

balakrishna11465816265

మరో సింహా కి ఫిక్సయిన బాలయ్య

Spread the loveనందమూరి బాలకృష్ణ ప్రస్తుతం చేస్తోన్న సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రానికి కె.ఎస్‌.రవి కుమార్‌ దర్శకత్వంRead More

ntr pawan1

ఎన్టీఆర్, పవన్ ని కలిపిన త్రివిక్రమ్

Spread the loveయంగ్ టైగర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాకు ఇవాళ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతులRead More

  • ప్రభాస్ బర్త్ డే కానుక..
  • పాపం..రాజా దిగ్రేట్
  • జవాన్ ముహూర్తం రెడీ
  • సీనియర్ హీరోతో మెహరీన్
  • యూరప్ కి పవన్ కల్యాణ్..
  • పెళ్లికి పిలుస్తానని ప్రకటించిన రేణూదేశాయ్
  • పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి నిరాశ…
  • మహేష్ ఫ్యామిలీ ముచ్చట..
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *