టాలీవుడ్ టాప్ పవన్ కళ్యాణ్

సెలబ్రిటీల సంపాదన విషయంలో తాజా లెక్కలు వెలువడ్డాయి. దేశంలో కండలవీరుడు మొదటి స్థానంలో నిలిచాడు. సల్మాన్ ఖాన్ కి టాప్ ప్లేస్ దక్కింది. ఈయన ఏడాదికి 253.25 కోట్లు సంపాదిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాదిలో అత్యధికంగా ఆర్జించిన వంద మంది సెలబ్రిటీల జాబితాను ఫోర్బ్స్ సంస్థ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో సల్మాన్ ఖాన్ అగ్రస్థానంలో నిలిచారు. ఈ హీరో సినిమాలే కాకుండా చాలా బ్రాండ్లకు అంబాసిడర్. మరో పక్క బిగ్‌బాస్, దస్ కా దమ్ వంటి టీవీ షోలకు వ్యాఖ్యాత కూడా. వీటిన్నటి ద్వారా ఈ ఏడాది సల్మాన్ అందరికీ కంటే అధికంగా ఆర్జించారు. ఇలా ఫోర్బ్స్ జాబితాలో సల్మాన్ వరుసగా మూడోసారి నిలిచారు.
ఈ జాబితాలో రెండో వ్యక్తిగా భారత క్రికెట్ సారథి విరాట్ కోహ్లి (228.09కోట్లు) నిలిచారు. తర్వాత స్థానంలో బాలీవుడ్ హీరో అక్షరు కుమార్ కైవశం చేసుకున్నారు. అక్షరు గత ఏడాది కూడా ఈ జాబితాలో నిలిచారు.
దక్షిణాది నుంచి ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన వ్యక్తి రజనీకాంత్, ఆ తర్వాత స్థానంలో పవన్ కల్యాణ్ మొదటి స్థానంలో నిలిచారు. టాలీవుడ్ నుంచి కూడా ఇతనిదే తొలిస్థానం. ఆయన ఈ ఏడాది చేసిన ‘అజ్ఞాతవాసి’ అంతగా ప్రేక్షకారణ లభించలేదు. రెండో స్థానంలో ఎన్టీఆర్, మూడో స్థానంలో మహేశ్ బాబు, తర్వాత స్థానాల్లో నాగార్జున, కొరటాల శివ, అల్లు అర్జున్, రామ్ చరణ్, విజరు దేవరకొండ నిలిచారు. తక్కువ సమయంలో పాపులార్టీ సంపాదించుకున్న విజరు దేవరకొండ ఈ ఏడాది 14 కోట్లు సంపాదించి ఈ జాబితాలో నిలవడం విశేషం.
ఫోర్బ్స్ జాబితాలో మహిళలకు ఒక్కరికే స్థానం లభించింది. ఆవిడే దీపికా పదుకొనే. సంజరులీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ‘పద్మావత్’ చిత్రంలో దీపికా పదుకొనే టైటిల్ రోల్ పోషించింది. బాలీవుడ్లో విడుదలై అత్యధికంగా కాసులు కురిపించిన చిత్రమిది. అందుకే రూ.114 కోట్లతో దీపికా ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది. అమిర్ ఖాన్ రూ. 97.5 కోట్లతో ఆరో స్థానంలోనూ, అమితాబ్ బచ్చన్ రూ.96.17 కోట్లతో ఏడో స్థానంలోనూ, రణవీర్ సింగ్ రూ. 84.67 కోట్లతో ఎనిమిదో స్థానంలోనూ, అజరు దేవగన్ రూ. 84.67 కోట్లతో పదో స్థానంలోనూ నిలిచారు. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (రూ. 66 కోట్లు), అలియా భట్ (రూ.58.83కోట్లు), షారుఖ్ ఖాన్ ((రూ.56కోట్లు), రజనీకాంత్ (రూ.50కోట్లు), వరుణ్ ధావన్(రూ.49.58కోట్లు), అనుష్క శర్మ (రూ.45.83కోట్లు), రణబీర్ కపూర్ (రూ.44.5కోట్లు), అర్జిత్ సింగ్ (రూ.43.32కోట్లు), సంజరు దత్ (రూ.37.85 కోట్లు) ఆర్జించారు.
Related News

‘సైరా’ అంటున్న అల్లు అర్జున్
Spread the loveమెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం శరవేగంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.Read More

ఆమెను దేవుడే పంపాడంటున్న విశాల్
Spread the loveటాలీవుడ్ నుంచి వెళ్లి కోలీవుడ్ లో కీర్తి గడించిన తెలుగు బిడ్డ విశాల్ చివరకు తెలుగు అమ్మాయినేRead More