Main Menu

అజ్ఞాతవాసి రిజల్ట్ తో ఎన్టీఆర్ కలవరం

Spread the love

అజ్ఞాతవాసి సినిమా ఫలితంతో పవన్ అభిమానులు అంతా షాక్ కి గురయ్యారు. అయితే అజ్ఞాతవాసి ఫలితంతో బుక్ అవడం పవన్ అభిమానుల వంతయితే….అదే టైం లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఒకింత ఉలికిపడ్డారు. అందుకు కారణం త్రివిక్రమ్ తన తదుపరి సినిమా ఎన్టీఆర్ తో ప్లాన్ చేయడమే. అజ్ఞాతవాసిని అడ్డదిడ్డంగా తీసేసిన త్రివిక్రమ్, ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాని ఇంకేంతలా చేస్తాడో అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భయం.

ఈ ఫీలింగ్ ఎన్టీఆర్ వరకు కూడా చేరింది. దాంతో ఎన్టీఆర్ కూడా డైలమాలో పడ్డాడట. ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకి సంబంధించి స్టొరీ డిస్కషన్స్ పూర్తయ్యాయి. సినిమా లాంచ్ కూడా అయ్యింది. కాకపోతే ఫుల్ లెంగ్త్ స్క్రీన్ ప్లే రెడీ అయ్యిందా? లేదా? అనేది ప్రస్తుతానికి అనుమానం. స్క్రీన్ ప్లేతో పాటు స్టొరీ మొత్తం ఎన్టీఆర్ విన్నట్లు అయితే….మరోసారి ఆలోచించుకోవడం బెటర్. ఒకవేళ పూర్తిస్థాయి స్క్రీన్ ప్లే సిద్దం కాకపోతే దగ్గరుండి తారక్ ఆ పని పూర్తి చేసుకోవడం మంచింది.

ఎందుకంటే…అజ్ఞాతవాసి ఫలితం దృష్ట్యా…స్క్రీన్ ప్లే బాధ్యత మొత్తాన్ని త్రివిక్రమ్ కు అప్పగించడం మంచింది కాదు. అజ్ఞాతవాసి కథను ఫోన్ లో పవన్ కు వినిపించాడట త్రివిక్రమ్. కేవలం 10నిమిషాల ఫోన్ సంభాషణతో పవన్ ఓకే చెప్పాడట. ఈ విషయాన్ని త్రివిక్రమ్ స్వయంగా వెల్లడించాడు. తన ఆత్మలాంటి త్రివిక్రమ్ పై ఉన్న నమ్మకంతో సినిమా మొత్తాన్ని అతడికి వదిలేశాడు పవన్. అంతిమంగా రిజల్ట్ ఏంటనేది మనం చూస్తున్నాం. ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దని ఎన్టీఆర్ కు సూచిస్తున్నారు ఫ్యాన్స్.






Related News

సందిగ్ధంలో స్టైలిష్ స్టార్

Spread the loveస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి క్లారిటీ క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌ల వ‌రుసగా ఫెయిల్యూర్స్ తో ఆయ‌నRead More

మిడ్ నైట్ మ‌సాజ్ కి వ‌స్తాన‌న్నాడు..!!!

Spread the loveబాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా రాధికా ఆప్టే వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశంగా ఉంటుంది. మంచి టాలెంట్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *