ఎన్టీఆర్ సెంచరీ కొట్టేశాడు..!

తారక్ వ్యవహారం చాలా ఆసక్తిగా ఉంటుంది. ఈ జూనియర్ ఎన్టీఆర్ తొలినాళ్లలో బొద్దిగా కనిపించేవాడు. ఆ తర్వాత భారీ సైజులోకి మారిపోయాడు. కానీ అనూహ్యంగా యమదొంగతో స్లిమ్ అయిపోయి చాలామందిని ఆశ్చర్యపరిచాడు. అలాంటిదిప్పుడు మళ్లీ భారీ కాయంతో ముందుకొస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.
టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన భారీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ సినిమా కోసం తన వెయిట్ బాగా పెంచేసిట్టు ఎన్టీఆర్ గురించి ప్రచారం సాగుతోంది. ఈ సినిమాలో ఏకంగా వంద కిలోల బరువున్న భారీతనం ప్రదర్శించబోతున్నట్టు చెబుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం దానికి తగ్గట్టుగా ఎన్టీఆర్ శరీర మార్పులు జరిగినట్టుగా సమాచారం.
దీనికి గుబురు గడ్డం కూడా తోడవుతుందని చెబుతున్నారు. సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రయినర్ లాయిడ్ స్టీవెన్స్ ఆధ్వర్యంలో కొన్ని నెలలుగా ఈ బాడీ, లుక్ కోసం తారక్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. కృషికి తగిన ఫలితాన్ని సినిమాలో చూపిస్తారట! అలాగే, ఈ సినిమాలో రామ్‌చరణ్ లుక్ కోసం ప్రముఖ ముంబై హెయిర్ స్టయిలిస్ట్ ఆలిం హకీంను రాజమౌళి రప్పించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా వేసిన సెట్లో చిత్రీకరణ చేస్తున్నారు. నవంబర్ 19న ఈ షెడ్యూల్ మొదలైంది. మధ్యలో రెండు మూడు రోజులు విశ్రాంతి తీసుకున్న రాజమౌళి… చరణ్, తారక్‌పై యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. మరో నాలుగైదు రోజులు ఈ షెడ్యూల్ కొనసాగనున్నట్టు తెలుస్తుంది. డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దాంతో ఈ సినిమాలో ఎన్టీఆర్ ఆహార్యం ఆసక్తిని రాజేస్తోంది.
Related News

రూటు మార్చిన కాజల్
Spread the loveటాలీవుడ్ చందమామ రూటు మార్చింది. టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా వున్న కాజల్ అగర్వాల్ ఐటెమ్ సాంగ్స్ చేసేందుకుRead More

పవన్ మాజీ భార్య రీ ఎంట్రీ
Spread the loveజనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. మరాఠీలో ‘ఇష్క్Read More