Main Menu

ఎన్టీఆర్ మ‌రో సంచ‌ల‌నం

Spread the love

ఎన్టీఆర్‌ ఇటీవల పంథా మార్చి విభిన్న కథా చిత్రాల్లో నటిస్తున్నారు. ‘టెంపర్‌’ నుంచి ‘అరవింద సమేత’ వరకు దేనికదే డిఫరెంట్‌ కథా చిత్రాలను చేసి విజయాలను అందుకున్నారు. అదే కొత్తదనాన్ని కొనసాగిస్తూ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మల్టీస్టారర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో నటిస్తు న్నారు. తర్వాతి చిత్రం ‘అర్జున్‌ రెడ్డి’ ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో నటించేం దుకు సిద్ధమవు తున్నారట. మొదట మహేష్‌ బాబు హీరోగా సందీప్‌రెడ్డి వంగా సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు ఎన్టీఆర్‌కి ఓ కథ చెప్పారట. స్క్రిప్ట్‌ బాగా నచ్చడంతో ఎన్టీఆర్‌ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.

‘అర్జున్‌రెడ్డి’ సంచలన విజయం సాధించింది. మరి ఇప్పుడు ఎన్టీఆర్‌తో మరో సంచలనాత్మక సినిమా తీసే అవకాశం ఉన్నట్టు చిత్ర వర్గాలు అనుకుంటున్నాయి. ప్రస్తుతం సందీప్‌ రెడ్డి వంగా బాలీవుడ్‌లో ‘కబీర్‌ సింగ్‌’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో షాహిద్‌ కపూర్‌, కైరా అద్వానీ జంటగా నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌తో కలిసి నటిస్తున్న మల్టీస్టారర్‌ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ ఇప్పటికే మొదటి షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. అయితే ఈ చిత్ర కథేంటనేది అన్ని వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. గ్యాంగ్‌స్టర్‌ నేపథ్యంలో సాగుతుందని వినిపించింది. అయితే ఇది పీరియాడికల్‌గా సాగుతుందట. ఎన్టీఆర్‌ డాన్‌ తరహా నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రలో కనిపిస్తారని తెలుస్తుంది. ఇందులో కథానాయికలుగా రష్మిక మందన్నా, కీర్తిసురేష్‌తోపాటు మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే హీరోయిన్లకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 2020లో విడుదల కానుంది. ఆ తర్వాతే సందీప్‌ రెడ్డి వంగా సినిమా ఉంటుందని సమాచారం.






Related News

మ‌హేష్ తో అర్జున్ రెడ్డి..!

Spread the loveవిజయ్ దేవరకొండను అర్జున్‌రెడ్డితో ఒక్కసారిగా స్టార్ హీరోను చేసిన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగ ప్రస్తుతం అదే అర్జున్‌రెడ్డినిRead More

ప్ర‌భాస్ కి ఆమె ఏం పంపిందో తెలుసా?

Spread the loveబాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ప్రస్తుతం ప్రభాస్ తాజా చిత్రం ‘సాహో’ లో హీరోయిన్ గా నటిస్తున్నRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *