ఎన్టీఆర్, చెర్రీ క‌లిసే వెళ్లారు…!

Ram Charan Ntr At Airport
Spread the love

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌లిసి సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రాజ‌మౌళి వీరిద్ద‌రితో విడివిడిగా బంప‌ర్ హిట్ లు కొట్టేశాడు. ఇప్పుడు ఇద్ద‌రినీ క‌లిపి సినిమా కోసం ప్లాన్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. ఈ ఏడాది చివ‌రిలో సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. వ‌చ్చే ఏడాది వేస‌విలో సందడి చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది. అయితే ఈలోగానే ఎన్టీఆర్, చెర్రీ క‌లిసి అమెరికా ప‌య‌నం కావ‌డం విశేషంగా మారింది. ఒకే ప‌ని మీద వెళ్లిన‌ట్టు భావిస్తున్నారు. త్వ‌ర‌లో చేయ‌బోతున్న మ‌ల్టీస్టార‌ర్ మువీకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కోస‌మే అమెరికా వెళ్లి ఉంటార‌ని స‌మాచారం.

ప్ర‌స్తుతం చెర్రీ లేటెస్ట్ మువీ రంగ‌స్థ‌లం రెడీ అయ్యింది ఈ నెలాఖ‌రులో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. టీజ‌ర్, సింగిల్స్ సంచ‌ల‌నంగా యూట్యూబ్ లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అదే స‌మ‌యంలో ఎన్టీఆర్ త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్ కి రెడీ అవుతున్నాడు. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తొలిసారిగా న‌టిస్తున్న సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌స‌న పూజా హెగ్డేని ఎంపిక చేశారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతోంది.

ఈలోగా ఇద్ద‌రూ క‌లిసి అమెరికా ట్రిప్ వేయ‌డం, వారి ఎయిర్ పోర్ట్ ఫోటోలు నెట్ లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి రంగస్థలం షూటింగ్ ముగించుకున్న చరణ్‌ ఇంకా అదే లుక్‌లో కనిపిస్తున్నాడు. ఎన్టీఆర్‌ మాత్రం త్రివిక్రమ్ సినిమా కోసం స్లిమ్‌ అండ్‌ ఫిట్‌గా రెడీ అయిపోయాడు. దాంతో ఇద్ద‌రు టాప్ హీరోల క‌ల‌యిక ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తోంది.


Related News

DY4IkDSW4AE8pbm

మెగా ఫ్యామిలీ లుంగీల క‌థ తెలుసా..!

Spread the loveమెగాస్టార్ ఫ్యామిలీ లుంగీల వెంట‌ప‌డింది. అయితే అది ఇప్పుడిప్పుడే కాదండోయ్..చిరంజీవి కాలం నుంచి ఆ స‌ర‌దా ఉంది.Read More

Rakul-Preet-Singh-Images

ర‌కుల్ ఆయ‌న‌పై మ‌న‌సు ప‌డింది…!

Spread the loveటాలీవుడ్ లో రెండేళ్ల క్రితం ర‌కుల్ హ‌వా క‌నిపించింది. కానీ అంత‌లోనే ఆశ‌లు ఆవిర‌య్యాయి. వెంక‌టాద్రి ఎక్స్Read More

 • రాజ‌మౌళి కోసం స్పీడ్ పెంచిన త్రివిక్ర‌మ్
 • మెగాస్టార్ ముహూర్తం పెట్టేశాడు…
 • పూజాగానంలో టాలీవుడ్
 • గొల్ల‌భామ‌పై క్లారిటీ
 • చీటింగ్ కేసులో మ‌రో హీరోయిన్
 • ప్రెసిడెంట్ పై ఫైర్ అయిన బాలీవుడ్ బ్యూటీ
 • చైనా వైపు చిరంజీవి చూపు
 • అన‌సూయ బ్యాక్ గురించి ఆస‌క్తిక‌ర కామెంట్స్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *