Main Menu

మహేష్ ని మెప్పించిన చిన్నారి…

Mahesh-Seen-as-the-Chief-Minister
Spread the love

సూపర్ స్టార్ మహేష్ బాబు కి అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ లో ఆయన అగ్రపీఠాన ఉంటారు. అయితే తాజాగా యూఎస్ నుంచి ఓ చిన్నారి చేసిన ప్రయత్నం మహేష్ మనసు మెప్పించింది. తన అభిమాని రాసిన లేఖ ఆయన్ని ఆకట్టుకుంది. ఆ విషయాన్ని ఆయన ఫ్యాన్స్ తో పంచుకున్నారు.

“మహేశ్ గారు మీరంటే నాకు చాలా ఇష్టం. నేను మీకు పెద్ద అభిమానిని, మీ సినిమాలన్నీ కచ్ఛితంగా చూస్తాను. మీ సినిమాలన్నింటిలో నాకు ‘శ్రీమంతుడు’ అంటే చాలా ఇష్టం. మీరు చాలా బిజీగా ఉంటారని తెలుసు. కానీ సమయాన్ని కేటాయించి నా లెటర్‌ను చదువుతున్నందుకు థ్యాంక్స్” అంటూ అమెరికా నుంచి ఓ చిన్నారి రాసిన లేఖకు మహేష్ మురిసిపోయారు. దాంతో వెంటనే సమాధానం కూడా రాశారు.

“డియరెస్ట్ నేహా.. ప్రపంచమంతా ఇప్పుడు ఇంటర్‌నెట్, మెయిల్స్‌తో నడుస్తుండగా.. నీ నుంచి ఒక పోస్ట్‌ లెటర్‌ను అందుకోవడం చాలా ఆనందాన్ని కలిగించింది. నా సినిమాలను నువ్వు ఎంజాయ్ చేస్తున్నా అని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. సితార, గౌతమ్‌లకు కూడా ‘శ్రీమంతుడు’ అంటే చాలా ఇష్టం. నీకు నచ్చే విధంగా మరిన్ని సినిమాలను చేస్తా. నీ స్కూలింగ్‌కు ఆల్ ది బెస్ట్. నా సమాధానాన్ని నువ్వు పోస్ట్‌బాక్స్‌లో కూడా అందుకుంటావు” అని మహేశ్ సమాధానాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా నేహా రాసిన లెటర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మహేష్ తన ఆనందాన్ని పంచుకున్నారు.






Related News

ntr

ఎన్టీఆర్ హోస్ట్ కాద‌ట‌…

Spread the loveవెండితెర‌పై వ‌రుస హిట్ల‌తో రాణిస్తున్న ఎన్టీఆర్ బుల్లితెర‌పై కూడా ఫ్యాన్స్ ని ఖుషీ చేశాడు బిగ్ బాస్Read More

665848-maheshbharat

మెగా ఫ్యామిలీతో క‌లిసి మ‌హేష్

Spread the loveఇప్ప‌టికే జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ ఓకే అయ్యింది. టాలీవుడ్ జ‌క్క‌న్న దానికి స‌న్నాహాల్లో ఉన్నారు.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *