Main Menu

ద్రౌప‌ది న‌య‌న‌తారే..!

Spread the love

భారతీయ చలనచిత్ర చరిత్రలో కనీ వినీ ఎరగని రీతిలో వెయ్యి కోట్ల వ్యయంతో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ చిత్రం మ‌హా భార‌తం. బీ. ఆర్. శెట్టి నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని దర్శకుడు కుమార్ మీనన్ తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన కార్యక్రమాలు శరవేగంగా జరుగుతుండగా వచ్చే ఏడాది సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు. ఇక నటీనటుల ఎంపిక ప్రక్రియని కూడా వేగవంతం చేశారు. మోహన్ లాల్ ని ఇప్పటికే ఓ ప్రధాన పాత్రకి ఎంపిక చేయగా ప్రభాస్, నాగార్జున, మహేష్‌ ఇలా పలువురి పేర్లు పరిశీలనలోకి వచ్చాయి.

అయితే ఇప్పుడు కన్నడలో కూడా అదే మాదిరిగా మహా భారతం నేపథ్యంలో కురుక్షేత్ర అనే భారీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నారు. భారీ తారాగాణంతో ఈ మూవీ తెరకెక్కబోతోంది. మహా భారతంలోని స్త్రీ పాత్రలలో ముఖ్యమైన పాత్ర ద్రౌపది కాగా , ఆ రోల్ కోసం నయన తారని ఎంపిక చేసారని అంటున్నారు. చారిత్రాత్మక చిత్రంలో మంచి నటనా నైపుణ్యం కనబరచిన నయనతార అయితే ద్రౌపదికి సరిగ్గా సరిపోతుందని మేకర్స్ భావించారట. నయనని కలిసి పాత్ర గురించి కూడా వివరించారట.దీనికి నయన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్. మరో వైపు రాజమౌళి కూడా మహా భారతం నేపథ్యంలో ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించే ఆలోచనలో ఉన్న సంగతి తెలిసిందే.






Related News

ఎన్టీఆర్ లో రాశిఖ‌న్నా రోలేంటో తెలుసా..?

Spread the loveఎన్టీఆర్ బ‌యోపిక్ ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్ అవుతోంది. భారీ తార‌గ‌ణంతో వ‌స్తున్న సినిమా పెద్ద చ‌ర్చ‌కుRead More

పూరీ ద‌ర్శ‌క‌త్వంలో రెండో మ‌న్మ‌థుడు

Spread the loveటాలీవుడ్ లో బ‌యోపిక్ లు, సీక్వెల్స్ సీజ‌న్ జోరుగా ఉంది. దాంతో అంద‌రూ హీరోలు వాటినే అనుస‌రిస్తున్నారు.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *