బన్నీ సినిమా కాపీ కొట్టలేదట…

Allu-Arjun-2_0
Spread the love

టాలీవుడ్ మువీస్ వ్యవహారం ఆసక్తిగా మారుతోంది. ఇతర భాషా చిత్రాలకు కాపీ అనే కామెంట్లు పదే పదే వినిపిస్తున్నాయి.ఇటీవల పవన్‌ కళ్యాణ్‌ నటించిన ‘అజ్ఞాతవాసి’ కూడా ఫ్రెంచ్‌ సినిమా ‘లార్గోవించ్‌’కు కాపీ అనే విషయం తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్‌ సినిమా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ కూడా కాపీ సినిమా అనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ‘ఆంట్వోని ఫిషర్‌’ అనే హాలీవుడ్‌ సినిమా నుంచి కాపీ కొట్టారని, ఆ చిత్రం ఆధారంగా దర్శకుడు వక్కంతం వంశీ ఈ కథను తయారు చేశారనే కామెంట్లు సామాజిక మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి.

ఆ సినిమాలో హీరో చిన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోయాక అమెరికా నావీలో చేరతాడు. అప్పట్లో తను చూసిన సంఘటనల కారణంగా కోపంతో ఊగిపోతాడు. దీన్ని గమనించిన ఓ డాక్టర్‌ హీరోని మామూలు మనిషిగా చేయడం, తర్వాత అతను హీరోకు గురువుగా మారడమనేది ఆ చిత్ర కథ. ఇటీవల విడుదలైన అల్లు అర్జున్‌ సినిమా ట్రైలర్‌ సైతం ఇదే పోలినట్టు ఉండటంతో కాపీ అనే న్యూస్‌ సర్వత్రా హాట్‌ టాపిక్‌గా మారింది. తాజా సినిమాలో ఆర్మీ ఆఫీసర్‌గా అల్లు అర్జున్‌, డాక్టర్‌గా అర్జున్‌ నటిస్తున్నారు. వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయెల్‌ కథానాయికగా నటిస్తోంది. ఏప్రిల్‌ 27న ఈ సినిమా విడుదల కానుంది.

దాంతో స్పందించిన సినీ నిర్మాత ఈ కామెంట్స్ ని కొట్టేశారు. నిర్మాత లగడపాటి శ్రీధర్‌ సోషల్‌ మీడియా ద్వారా స్పందించారు. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ హాలీవుడ్‌ చిత్రం ‘ఆంట్వోని ఫిషర్‌’ కథను కాపీ కొట్టి తీస్తున్నారని వస్తోన్న వార్తల్లో నిజం లేదు. ఒక టీజర్‌ చూసి కాపీ అని నిర్ణయించడం కరెక్ట్‌ కాదు. దానికి, మా చిత్ర కథకు సంబంధం లేదు. పూర్తి భిన్నమైనది. ఆటోబయోగ్రాఫికల్‌గా వచ్చిన ఆ సినిమా పరాజయం చెందింది. అలాంటి సినిమాను ఎలా కాపీ కొడతాం?’ అని నిర్మాత లగడపాటి శ్రీధర్‌ ప్రశ్నించారు.


Related News

kajal

కాజల్ పెళ్లి!

Spread the loveచంద‌మామ‌తో కెరీర్ షురూ చేసి టాలీవుడ్ ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న ముద్దుగుమ్మ కాజల్. ద‌శాబ్ధ‌కాలానికి పైగా అగ్ర‌హీరోలంద‌రితోనూRead More

priya warrier

ప్రియా వారియ‌ర్ కి ఊర‌ట‌

Spread the loveఒక్క టీజ‌ర్ తో దేశ‌మంతా పాపులారిటీ సంపాదించిన ప్రియా వారియ‌ర్ కి ఊర‌ట ల‌భించింది. హైద‌రాబాద్ తోRead More

 • మరో ఫ్యామిలీ మల్టీస్టారర్‌..!
 • రాశిఖ‌న్నాకి బంప‌రాఫ‌ర్ !
 • జిగేల్ మంటున్న రామ్ చ‌ర‌ణ్
 • ఆస్ప‌త్రి పాల‌యిన స్టార్ హీరో
 • ర‌కుల్ బికినీపై రచ్చ‌
 • జ్యోతికపై కేసు
 • చెర్రీని క్రాస్ చేసిన అల్లు అర్జున్
 • షాక్ కి గురయిన చిరు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *