అర్జున్ vs అర్జున్

allu arjun
Spread the love

అల్లు అర్జున్‌ తాజా చిత్రం ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ‘కిక్‌’, ‘టెంపర్‌’, ‘రేసుగుర్రం’ వంటి హిట్‌ సినిమాల కథకుడు వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీధర్‌ నిర్మిస్తున్నారు. నాగబాబు సమర్పిస్తుండగా, బన్నీ వాసు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అను ఇమ్యాన్యుయేల్‌ నాయిక. సీనియర్‌ అర్జున్‌ కీలక పాత్రలో, శరత్‌కుమార్‌ విలన్‌ పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్‌లో పేరు పొందిన సంగీత దర్శక ద్వయం విశాల్‌-శేఖర్‌ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఇద్దరు అర్జున్‌లకు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు యూనిట్‌ వర్గాలు తెలిపాయి. ‘‘శుక్రవారం నుంచి బ్యాంకాక్‌ ఫైట్‌ మాస్టర్‌ కిచ్చా ఆధ్వర్యంలో రామోజీ ఫిల్మ్‌సిటీలో నాలుగు రోజుల పాటు యాక్షన్‌ ఎపిసోడ్‌ తీస్తాం. 24 నుంచి పదిహేను రోజుల పాటు ఊటీలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తాం. చిత్రంలో ఐదు పాటలుంటాయి. వీటిలో రెండింటికి దేశంలోనే టాప్‌ కొరియోగ్రాఫర్లు ఇద్దరు పనిచేస్తారు. ఎమోషనల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది’’ అని ఆ వర్గాలు చెప్పాయి. 2018 ఏప్రిల్‌ 27న చిత్రాన్ని విడుదల చేస్తారు.


Related News

naga chiatanya

చైతూతో చేతులు కలపుతున్న మరో హీరో

Spread the loveటాలీవుడ్ లో మరో ఆసక్తికర కాంబినేషన్ తెరమీదకు రాబోతోంది. దానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అక్కినేని వారసుడు ఇప్పటికేRead More

mahesh

రాజమౌళితో సూపర్ స్టార్ మువీ

Spread the loveసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న స్పైడర్ 27న విడుదలకు సిద్ధమైంది. భారీ బడ్జెట్‌తో అత్యున్నతRead More

 • బాహుబలి చేరువలో స్పైడర్?
 • ఆమె నా చెల్లికాదంటున్న అంజలి
 • సెంచరీ కొడుతున్న ఎన్టీఆర్
 • బిగ్ బాస్ లో బిగ్ డే రేపు
 • టాలీవుడ్ టాప్ 5లో జై లవకుశ
 • నీహారిక హ్యాపీ వెడ్డింగ్
 • సైరా వచ్చే నెల నుంచే..!
 • చిక్కుల్లో హీరోయిన్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *