ముద్ర‌గ‌డ‌తో ముప్పు ఎవ‌రికి..!

mudragada-and-wife
Spread the love

ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం. తాజాగా మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చారు. రాజ‌కీయంగా సంచ‌ల‌నం రేపుతున్నారు. కాపు రిజ‌ర్వేష‌న్ల సాధ‌నే ల‌క్ష్యంగా ఆయ‌న పాద‌యాత్ర‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న త‌రుణంలో కాపు ఉద్య‌మం మ‌రోసారి కాక‌పుట్టిస్తోంది. ముఖ్యంగా గోదావ‌రి జిల్లాల్లో ముద్ర‌గ‌డ ఉద్య‌మ ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం పాద‌యాత్ర‌ను అడ్డుకోవ‌డానికి పావులు క‌దుపుతోంది. పోలీసుల‌ను పెద్ద సంఖ్య‌లో మోహ‌రించింది. పాద‌యాత్ర సాగనిచ్చేది లేద‌ని చెబుతోంది. అనుమ‌తుల్లేని యాత్ర‌లతో శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయ‌ని చెబుతోంది. కానీ ముద్ర‌డ‌గ వాద‌న వేరుగా ఉంది. త‌మ‌కు ఇచ్చిన మాట అమ‌లు చేయ‌క‌పోవ‌డంతోనే పాద‌యాత్ర‌ల‌కు సిద్ధం కావాల్సి వ‌చ్చిందంటున్నారు.

మ‌రోవైపు టీడీపీ ఎదురుదాడికి దిగుతోంది. ముద్ర‌గ‌డ పాద‌యాత్ర‌లో యువ‌త ఎవ‌రూ పాల్గొన‌కూడ‌ద‌ని చెబుతోంది. వైసీపీ రాజ‌కీయ వ్యూహాల్లో భాగంగానే ముద్ర‌గ‌డ కాపుల‌ను రెచ్చ‌గొడుతున్నారని విమ‌ర్శిస్తోంది. మ‌రోవైపు వైసీపీ నేత‌లు మాత్రం చంద్ర‌బాబు అండ్ కో తీరు సరికాదంటున్నారు. కాపుల రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో మాట త‌ప్పి, ఇప్పుడు నోరునొక్కే ప్ర‌య‌త్నం చేయ‌డం అన్యాయ‌మంటున్నారు. ప్ర‌భుత్వ తీరును నిర‌సిస్తున్నారు. దాంతో ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయంగానూ దుమారం రేపుతోంది. టీడీపీ కాపు నేత‌ల‌ను ఇబ్బందికి గురిచేస్తోంది. కాపుల‌కు రిజ‌ర్వేషన్లు ఖాయం అని ఎన్నిక‌ల్లో చెప్పి మంజునాథ క‌మిష‌న్ తొమ్మిది నెల‌ల్లో రిపోర్ట్ వ‌స్తుంద‌ని ఆ త‌ర్వాత చెప్పి ఇప్పుడు కాల‌యాప‌న చేస్తూ మోస‌గిస్తున్నార‌నే అభిప్రాయం సాదార‌ణ కాపు యువ‌త‌లో క‌నిపిస్తోంది. దాంతో నైతికంగా ముద్ర‌గ‌డ‌కు మ‌ద్ధ‌తు పెరుగుతోంది. పోలీసుల‌ను పెట్టి తాత్కాలికంగా అడ్డుకున్నా చివ‌ర‌కు ప్ర‌జాగ్ర‌హా ఫ‌లితం అనుభ‌వించ‌క త‌ప్ప‌దంటున్నారు.

ఈనేప‌థ్యంలోనే ప్ర‌స్తుతం కిర్లంపూడి నుంచి కోన‌సీమ వ‌ర‌కూ పోలీస్ బందోబ‌స్తు నిర్వ‌హిస్తున్న తీరు కూడా అల‌జ‌డి రేపుతోంది. క‌ర్నూలు ఉప ఎన్నిక‌ల మీద కూడా ఈ ప‌రిణామాల ప్ర‌భావం ఉంటుంద‌నే వాద‌న వినిపిస్తోంది. ఉప ఎన్నిక‌ల‌తోనే కాకుండా సాధార‌ణ ఎన్నిక‌ల నాటికి కాపు సామాజిక‌వ‌ర్గం దూర‌మ‌యితే చంద్ర‌బాబుకి చెమ‌ట‌లు త‌ప్ప‌వు. గ‌త ఎన్నిక‌ల్లో పీఠం ఎక్క‌డానికి పునాదిగా నిలిచిన గోదావ‌రి జిల్లాల్లో కాపులు దూర‌మ‌యితే టీడీపీకి అధికారం కూడా దూర‌మ‌వుతుంది. అందుకే ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల్సిన విష‌యంలో చంద్ర‌బాబు కాస్త అస‌హ‌నంతో క‌ష్టాలు కొనితెచ్చుకుంటున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. రాజ‌కీయంగా స‌మ‌స్య‌ల నుంచి గ‌ట్టెక్క‌డానికి ప్ర‌ద‌ర్శించాల్సిన సంయ‌మ‌నం ఆయ‌నలో క‌నిపించ‌డం లేద‌నే వాద‌న కూడా ఉంది. మొత్తంగా ముద్ర‌గ‌డ ఉద్య‌మం సామాజిక అంశాల నుంచి రాజ‌కీయ ప‌రిణామాల వ‌ర‌కూ దారితీయ‌డ ఖాయం. అది బాబు కుర్చీ కింద‌కు నీళ్లు తీసుకురావ‌డం కూడా అనివార్య‌మనే అంచ‌నాలు పెరుగుతున్నాయి.


Related News

chinthamaneni

ఎమ్మెల్యే చింతమనేనిపై కేసు

Spread the loveవివాదాస్పద టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై పోలీసు కేసు నమోదైంది. కొద్ది రోజుల క్రితం ఏలూరు మండలంRead More

west godavari

గోదారోళ్లకు చంద్రబాబు ద్రోహం చేశారా

Spread the loveఇదే ప్రశ్న ఉదయిస్తోంది. గోదావరి జిల్లా రైతాంగం ఇప్పుడు బిక్కమొఖాలు వేయాల్సి వస్తోంది. గోదావరి నదీ నీటిRead More

 • పశ్చిమలో టీడీపీకి ఎదురుదెబ్బ
 • మళ్ళీ ఖాకీల మధ్య కాపు నేత
 • ఏపీకి ఇది అన్యాయం కదా..
 • బాబుతో పీతల సుజాత వైరం ముదిరింది…
 • యనమల సీన్ అయిపోయిందా..?
 • టీడీపీలో కుర్చీలాట‌
 • నీళ్లేవి బాబు..!
 • ఆర్ నారాయణ మూర్తిని అడ్డుకున్నారు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *