Main Menu

మ‌హేష్ కి మ‌రో భామ ఫైన‌ల్!

Spread the love

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు అప్ క‌మింగ్ మువీ పై ఫ్యాన్స్ పెద్ద ఆశ‌లే పెట్టుకున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే స‌క‌ల స‌న్నాహాల‌తో సినిమా సిద్ధ‌మ‌వుతోంది. ఒకే టికెట్‌ మీద రకరకాల షేడ్స్‌ ఉన్న పాత్రలో అభిమాన హీరోని చూసి ఫ్యాన్స్‌ పండగ చేసుకునేలా తీర్చిదిద్దుతున్నారు. . దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కుతున్న ‘మహర్షి’ సినిమాలో మ‌హేష్ మూడు షేడ్స్ లో ద‌ర్శ‌న‌మిస్తార‌ని చెబుతున్నారు. అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘అల్లరి నరేశ్‌ మహేశ్‌ మిత్రుడిగా ‘రవి’ పాత్రలో కనిపించనున్నారు.

ఈ సినిమాలో మహేశ్‌బాబు కాలేజ్‌ స్టూడెంట్‌గా, బిజినెస్‌ మేన్‌గా కనిపిస్తారని తెలిసిందే. అయితే మోడ్రన్‌ రైతుగానూ ఈ చిత్రంలో కనిపిస్తారని సమాచారం. సో.. మూడు దశల్లో నడిచే ఈ కథలో మూడు డిఫరెంట్‌ షేడ్స్‌లో కనిపిస్తారని ఊహించవచ్చు. ఆల్రెడీ డెహ్రాడూన్‌లో స్టూడెంట్‌గా, యూఎస్‌లో బిజినెస్‌మేన్‌గా ఉన్న సన్నివేశాల షూటింగ్‌ను పూర్తి చేశారు. ప్రస్తుతం ఓ స్టూడియోలో వేసిన గ్రామీణ సెట్లో షూటింగ్‌ జరుపుకుంటోంది ‘మహర్షి’. వచ్చే ఏడాది ఉగాది స్పెషల్‌గా ఏప్రిల్‌ 5న రిలీజ్‌ కానున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: కేయూ మోహనన్‌.

కాగా ఈ సినిమాలో తొలుత హీరోయిన్ గా పూజాహెగ్డేని ఫైన‌ల్ చేశారు. ఆమె పార్ట్ షూటింగ్ కూడా జ‌రుగుతోంది. ఇక రెండో హీరోయిన్ పాత్ర‌ను ఖాయం చేసిన త‌ర్వాత ఆ ఛాన్స్ మీనాక్షీ దీక్షిత్ ద‌క్కించుకున్న‌ట్టు టాలీవుడ్ వ‌ర్గాల ప్ర‌చారం. దూకుడు, బాద్ షా వంటి సినిమాల్లో స్పెష‌ల్ అప్పీరియ‌న్స్ లో క‌నిపించింది. ప‌లు తెలుగు సినిమాల‌లో క‌నిపించిన ఈ బాలీవుడ్ భామ‌ను ఖాయం చేయ‌డంతో మ‌హేష్ స‌ర‌స‌న ఆమెకు బంప‌రాఫ‌ర్ ద‌క్కిన‌ట్టుగా భావిస్తున్నారు. ఐటెం భామ‌కు సూప‌ర్ స్టార్ అవ‌కాశం ఇవ్వ‌డం ఆశ్చ‌ర్య‌మే అయినా ఆక‌ట్టుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.






Leave a Reply

Your email address will not be published. Required fields are marked *