Main Menu

మ‌హేష్ బాబుతో జ‌క్క‌న్న‌ సీక్వెల్

Spread the love

ఆర్ఆర్ఆర్ తో ఇండ‌స్ట్రీ అంద‌రి దృష్టిని త‌న వైపు తిప్పుకున్న రాజ‌మౌళి మ‌రో సంచ‌ల‌నానికి తెర‌లేపుతున్నారు. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ తో మ‌ల్టీ స్టార‌ర్ సినిమా సిద్ధం చేస్తున్న జ‌క్క‌న్న ఆ త‌ర్వాత సూప‌ర్ స్టార్ తో షురూ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నాడు. మ‌హేశ్ బాబు ప్రస్తుతం మహర్షి సినిమా చేస్తున్నాడు. దాదాపుగా సినిమా కంప్లీట్ కావొచ్చింది. మే 9 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.

ఈ సినిమా తరువాత మహేష్ బాబు ఎఫ్ 2 దర్శకుడు అనిల్ రావిపూడితో దర్శకుడు సినిమా చేస్తున్నాడు. మే నెలలో సినిమా ప్రారంభం కాబోతున్నది. దీని తరువాత మహేష్ బాబు .. రాజమౌళి కాంబినేషన్లో సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి.

మహేష్.. రాజమౌళి కంబినేషన్లో ఇప్పటి వరకు సినిమా రాలేదు. ఆర్ఆర్ఆర్ తరువాత రాజమౌళి మహేష్ తోనే సినిమా చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, రాజమౌళి దర్శకత్వం వహించిన విక్రమార్కుడు సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నాడని, ఆ సీక్వెల్ లో మహేష్ బాబు హీరోగా నటిస్తారని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం త్వరలోనే తెలుస్తుంది.






Related News

ర‌వితేజకి ఇద్ద‌రు!

Spread the love కాజల్‌ అగర్వాల్‌ మరో తెలుగు సినిమా చేసేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. ఆమె రవితేజకు జోడీగా నటించనుంది.Read More

ప్ర‌భాస్ పిరియాడిక్ మువీ..!

Spread the love ‘సాహో’ చిత్రీకరణలో వుండగానే ప్రభాస్‌ ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ సినిమాలోనూ నటిస్తున్నాడు. ఇదివరకే యూరప్‌లో కొంతభాగంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *