మ‌హేష్ బాబుది పెద్ద స్కెచే….!

Mahesh-Seen-as-the-Chief-Minister
Spread the love

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కెరీర్ ప‌రంగా కీల‌క సినిమా రాబోతోంది. ఇప్ప‌టికే వ‌రుస ఫ్లాఫులు ఆయ‌న్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దాంతో కొర‌టాల శివ కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా మీద కొండంత ఆశ‌లు పెట్టుకున్నారు ఫ్యాన్స్. దానికి త‌గ్గ‌ట్టుగానే సినిమా భారీ హంగుల‌తో ఉంటుంద‌ని ఇప్ప‌టికే అర్థ‌మ‌య్యింది. సినిమా రిలీజ్ కి కూడా లైన్ క్లియ‌ర్ కావ‌డంతో ఏప్రిల్ 20న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

దానికి త‌గ్గ‌ట్టుగా భారీ హంగామాకి స‌న్నాహాలు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను, టీజర్‌ను విడుదల చేసి అభిమానుల్లో ఆసక్తిని పెంచారు. ఇక నుంచి భారీ స్థాయిలోనూ, అదీ విభిన్నమైన రీతిలో ప్రమోషన్‌ కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సినిమాలో మహేష్‌ బాబు చేసిన రాజకీయ నాయకుడి పాత్ర తరహాలోనే ప్రమోషన్స్‌ కూడా చేపట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ముందుగా ఇందులో మహేష్‌ బాబు ఎలా ఉండబోతున్నారన్న దానిపై స్పష్టత ఇవ్వడానికి ఓ టీజర్‌ను ఈనెల ఆరో తేదీన అభిమానుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఆ తర్వాత ఆడియో రిలీజ్‌ వేడుక, కాంటెస్ట్‌లు, ప్రీ రిలీజ్‌ వేడుక వంటివి ప్లాన్‌ చేశారు.

గ‌తానికి భిన్నంగా ఈ సినిమా కోసం మ‌హేష్ బాబు బాధ్య‌త భుజాన వేసుకున్న‌ట్టు చెబుతున్నారు. ప్ర‌మోష‌న్ బాధ్య‌త అంతా అత‌డే తీసుకున్నారంటున్నారు. ‘శ్రీమంతుడుస కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా కావ‌డంతో గ్యారంటీ హిట్ అనే ధీమాతో క‌నిపిస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే ప్ర‌మోష‌న్ లో కొత్త స్కెచ్ సిద్ధం చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో మ‌హేష్ స‌ర‌స‌న కైరా అద్వాని కథానాయికగా చేస్తుంది.


Related News

DY4IkDSW4AE8pbm

మెగా ఫ్యామిలీ లుంగీల క‌థ తెలుసా..!

Spread the loveమెగాస్టార్ ఫ్యామిలీ లుంగీల వెంట‌ప‌డింది. అయితే అది ఇప్పుడిప్పుడే కాదండోయ్..చిరంజీవి కాలం నుంచి ఆ స‌ర‌దా ఉంది.Read More

Rakul-Preet-Singh-Images

ర‌కుల్ ఆయ‌న‌పై మ‌న‌సు ప‌డింది…!

Spread the loveటాలీవుడ్ లో రెండేళ్ల క్రితం ర‌కుల్ హ‌వా క‌నిపించింది. కానీ అంత‌లోనే ఆశ‌లు ఆవిర‌య్యాయి. వెంక‌టాద్రి ఎక్స్Read More

 • రాజ‌మౌళి కోసం స్పీడ్ పెంచిన త్రివిక్ర‌మ్
 • మెగాస్టార్ ముహూర్తం పెట్టేశాడు…
 • పూజాగానంలో టాలీవుడ్
 • గొల్ల‌భామ‌పై క్లారిటీ
 • చీటింగ్ కేసులో మ‌రో హీరోయిన్
 • ప్రెసిడెంట్ పై ఫైర్ అయిన బాలీవుడ్ బ్యూటీ
 • చైనా వైపు చిరంజీవి చూపు
 • అన‌సూయ బ్యాక్ గురించి ఆస‌క్తిక‌ర కామెంట్స్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *